కెప్టెన్‌గా కోహ్లీ: హర్షా భోగ్లే వన్డే జట్టులో ధోనికి దక్కని చోటు

హైదరాబాద్: ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే 2018 సంవత్సరానికి గాను 11 మందితో కూడిన తన డ్రీమ్ వన్డే జట్టుని ప్రకటించాడు. ఈ జట్టులో ఆసియాకు చెందిన ఎనిమిది మంది చోటు దక్కించుకున్నాడు. ఇక, విదేశీ క్రికెటర్లలో జో రూట్(ఇంగ్లాండ్), జోస్ బట్లర్(ఇంగ్లాండ్)లతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడలకు చోటు కల్పించాడు.
ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు చోటిచ్చాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ 73.57 యావరేజితో 1030 పరుగులు చేయగా... ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక, ధావన్ విషయానికి వస్తే ఈ ఏడాది 49.83 యావరేజితో 897 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగులు చేసిన కోహ్లీ
మూడో స్థానాన్ని కట్టబెట్టిన కెప్టెన్ కోహ్లీ ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లాండ్ క్రికెటర్లు జో రూట్, జోస్ బట్లర్‌కు నాలుగు, ఐదు స్థానాలను కట్టబెట్టాడు. వికెట్ కీపర్‌గా మాత్రం మహేంద్ర సింగ్ ధోనీకి చోటివ్వలేదు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు హర్షా భోగ్లేపై మండిపడుతున్నారు.

ధోనీ, హర్షా భోగ్లే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
2016 నుంచి ధోనీ, హర్షా భోగ్లేకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. బంగ్లాతో ఓ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నా.. వ్యతిరేకంగా మాట్లాడటంతో అప్పట్లో హర్షా భోగ్లేపై బిగ్‌బి అమితాబ్ బచ్చన్ సైతం విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత బీసీసీఐ.. హర్షా భోగ్లేని కామెంటేటర్ ఫ్యానల్ నుంచి ఏడాది పాటు తప్పించిన సంగతి తెలిసిందే.

వన్డే జట్టు
హర్షా భోగ్లే 2018 వన్డే జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్(ఓపెనర్లు)
కెప్టెన్: విరాట్ కోహ్లీ
జో రూట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్)
షకీబ్ అల్ హసన్, తిసార పెరీరా (ఆల్ రౌండర్లు)
రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ (స్పిన్నర్లు)
కాగిసో రబాడ, జస్‌ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్లు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications