For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూ టర్న్: ధోనీకి పొగడ్తలు, అడవికి రాజు ఎవరో తెలిసిందా..

మహేంద్ర సింగ్ ధోనిపై గతంలో విమర్శలు చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఓనర్ సోదరుడు హర్ష్ గోయెంకా తాజాగా అదే ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనిపై గతంలో విమర్శలు చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఓనర్ సోదరుడు హర్ష్ గోయెంకా తాజాగా అదే ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణె విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో, అవసరమైన సమయంలో, విలువైన ఇన్నింగ్స్‌తో ధోనీ (31 బంతుల్లో 61 పరుగులు) రైజింగ్‌ పుణెకు విజయాన్ని అందించాడు.

చివరి బంతిని బౌండరీకి తరలించి ఉత్తమ ఫినిషర్‌గా తనకున్న పేరును నిలబెట్టుకున్నాడు. గత అిదు మ్యాచులలో ధోనీ స్వల్ప స్కోరుకే ఔటవ్వడంతో, అతని పనైపోయిందని పలువురు విమర్శలు చేశారు.

ఈ క్రమంలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ యజమాని సంజీవ్‌ గొయాంకా సోదరుడు హర్ష్ గొయాంకా ట్విటర్‌లో ధోనీపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

టోర్నీలో భాగంగా పుణె తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో స్మిత్‌(84నాటౌట్‌, 57బంతుల్లో) జట్టుకు విజయం అందించాడు.

ఈ సందర్భంగా హర్ష ట్విటర్‌లో 'అడవికి రాజు ఎవరో తెలిసిపోయింది. స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పుణెకు స్మిత్‌ను సారథి ఎంచుకోవడం మంచి తరుణమే'నని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు హర్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటితో ఊరుకోని హర్ష ఆ తర్వాత పుణె ఆటగాళ్ల గణాంకాల వివరాలను ట్విటర్‌లో ఉంచాడు.

శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ అందించిన విజయంతో ఇప్పుడు ధోనీని అతను పొగిడాడు.

సన్‌రైజర్స్‌పై ధోనీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని, అతను తిరిగి తన ఫామ్‌ను అందుకోవడం ఆనందంగా ఉందని, ధోనీ కంటే ఉత్తమ ఫినిషర్‌ ఎవరూ ఉండరని ట్విట్ చేశాడు. అయితే, ఇప్పుడు తెలిసిందా అడవికి నిజమైన రాజు ఎవరో అంటూ నెటిజన్లు హర్ష్ గొయాంకాకి చురకలు అంటించారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+