Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేంజరస్ వెపన్ ఈ సన్ రైజర్స్ ప్లేయర్: ఏరికోరి.. !!

అఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్, వన్డే సిరీస్‌కు విదర్భ ఆల్ రౌండర్ హర్ష్ దూబే ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ స్పిన్ ఆల్ రౌండర్ ను రవీంద్ర జడేజా వారసుడిగా పరిగణిస్తోన్నారు. ఈ సిరీస్ కు రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అతని పేరును సెలెక్టర్లు పరిశీలనలోకి తీసుకోలేదు.

నిజానికి.. జడేజా తర్వాత అతని స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేస్తాడని చాలా మంది భావించారు గానీ అది సాధ్యపడట్లేదు. అక్షర్ పటేల్ లో నిలకడ లోపించింది. అతని వయస్సు ఇప్పుడు 32. సుదీర్ఘకాలం కొనసాగడం అసాధ్యం. ఓ రెండు సిరీస్ లు విఫలమైతే.. మరో స్పిన్ ఆల్ రౌండర్ ను వెదుక్కోవాల్సి వస్తుంది బీసీసీఐకి. అందుకే ఇప్పుడే హర్ష్ దుబేను జడేజాకు స్టాండ్ బైగా ఎంపిక చేసినట్టయింది.

Harsh Dubey earns selection for India s test and ODI series vs Afghan Tipped as Jadeja successor

ఇంటర్నేషనల్ క్రికెట్ సర్క్యూట్‌లో హర్ష్ దుబే ఎలా రాణిస్తారో ఓ ఛాన్స్ ఇచ్చారతనికి. 2024లో విదర్భ వెటరన్ స్పిన్నర్ ఆదిత్య సర్వదే కేరళకు మారినప్పుడు.. జట్టులో బౌలింగ్ లోటు కనిపించింది. ఆ సమయంలో దూబేకు ఆ బాధ్యతలు అప్పగించారు. తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడీ నాగ్ పూర్ క్రికెటర్. నిలకడగా సత్తా చాటుతున్నాడు.

2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో 10 మ్యాచ్‌లలో 69 వికెట్లు పడగొట్టాడు. ఇది.. ఒకే రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డుతో బిషన్ సింగ్ బేడీ, జయదేవ్ ఉనద్కత్, దొడ్డ గణేష్ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు. క్లాసిక్ ఎడం చేతివాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన దూబే సాధారణ పిచ్‌లపై కూడా అదనపు బౌన్స్, పదునైన టర్న్ రాబట్టగలడని చిన్ననాటి కోచ్ వెల్లడించాడు.

అతని బౌలింగ్ నైపుణ్యం విదర్భను ఆ సంవత్సరంలో రంజీ ఫైనల్ వరకు తీసుకెళ్లింది. ముంబైతో జరిగిన ఫైనల్ లో ఓటమి పాలైనప్పటికీ, దూబే మాత్రం అద్భుతంగా రాణించాడు. ఫైనల్‌లో 3/62, 5/144 వికెట్లతో దుమ్ము దులిపాడు. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న దూబే అరంగేట్రంలోనే మిచెల్ మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. ఛేజ్‌ మాస్టర్ విరాట్ కోహ్లీనీ అవుట్ చేశాడు.

దూబేను ఒకే డైమెన్షన్ ఉన్న బౌలర్‌గా చూడటం అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడమే. జడేజా మాదిరిగానే, అతను నిజమైన డ్యూయల్ త్రెట్ ఆల్ రౌండర్. బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా మ్యాచ్ విజేతగా నిలవగలడని కోచ్ ఘనీ వెల్లడించాడు.

Story first published: Wednesday, May 20, 2026, 10:46 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+