Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. బయటపెట్టిన హ్యారీ బ్రూక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన సూపర్-8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించడం గమనార్హం. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (100, 51 బంతుల్లో) అద్భుతమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. హ్యారీ బ్రూక్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన తర్వాత తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. ఇంగ్లండ్‌ను టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన సక్సెస్ క్రెడిట్‌ను కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (బాజ్)కు ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, తన రికార్డులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ నిర్ణయం 'బాజ్' మాస్టర్ మైండ్!
సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చే బ్రూక్.. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీనిపై స్పందిస్తూ.. "మేము ఇక్కడికి వచ్చింది సెమీస్‌కు చేరాలనే లక్ష్యంతో, ఆ పని పూర్తి చేశాం. నేను నంబర్ 3లో రావాలనేది మా కోచ్ బాజ్ మాస్టర్ మైండ్ ప్లాన్. ఈ రోజు ఉదయం అతను నా దగ్గరకు వచ్చి.. పవర్‌ప్లేను మనం మరింత సమర్థవంతంగా వాడుకోవాలి, నీకు ఎలాగో అటాకింగ్ గేమ్ అంటే ఇష్టం కదా అని చెప్పాడు. అదృష్టవశాత్తూ ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది" అని బ్రూక్ తెలిపాడు.

Harry Brook Secret Behind Century England Captain Praises Mastermind Brendon McCullum

"పాకిస్థాన్ నీ టీమ్.. నీ ఇష్టం!"
పాకిస్థాన్‌పై బ్రూక్‌కు ఉన్న అద్భుతమైన రికార్డును కోచ్ గుర్తు చేశాడట. "ఈ రోజు ఉదయం బాజ్ నాతో మాట్లాడుతూ.. 'పాకిస్థాన్ నీ ఫేవరెట్ టీమ్ కదా, మూడో స్థానంలో వెళ్తే ఏమంటావు?' అని అడిగాడు. నేను కూడా గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నాను, అందుకే వెంటనే ఒప్పుకున్నాను. మొత్తానికి ప్లాన్ సక్సెస్ అయ్యి మంచి ఫలితం వచ్చింది" అని బ్రూక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఆర్చర్ బౌలింగ్.. ఓవల్ జ్ఞాపకాలు!
ఇంగ్లండ్ బౌలింగ్‌ను మెచ్చుకుంటూ.. "టీ20ల్లో మంచి స్టార్ట్ రావడం చాలా ముఖ్యం. జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే మ్యాచ్ ముగిసే సమయంలో కొంచెం టెన్షన్ పడ్డాను. భారత్‌తో ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ ఫలితం (ఓటమి) మళ్ళీ రిపీట్ అవుతుందేమోనని భయమేసింది. కానీ చివరికి గెలిచినందుకు సంతోషంగా ఉంది" అని బ్రూక్ అన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయా?
టాప్ ఆర్డర్‌లో మార్పులపై స్పందిస్తూ.. "దీని గురించి నేను, బాజ్ చర్చించాల్సి ఉంది. ప్రస్తుతానికి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ పరిస్థితులను బట్టి ఏదైనా జరగొచ్చు" అని బ్రూక్ ముగించాడు.

Story first published: Wednesday, February 25, 2026, 7:00 [IST]
Other articles published on Feb 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+