For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోటికాడ ముద్ద లాగేసిన బ్రూక్.. కామెంట్రీ బాక్స్‌లో షాకింగ్ సీన్! (వీడియో)

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు అసలైన ఉత్కంఠను రుచి చూపించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకుని ఇంగ్లండ్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. బ్రూక్ ఫోర్ కొట్టి తన శతకాన్ని పూర్తి చేసిన ఆ క్షణం.. మైదానంలోనే కాకుండా కామెంట్రీ బాక్స్‌లోనూ పెను సంచలనం సృష్టించింది.

దక్షిణాఫ్రికా దెబ్బకు దిగొచ్చిన టీమిండియా: తుది జట్టులో భారీ మార్పులు?దక్షిణాఫ్రికా దెబ్బకు దిగొచ్చిన టీమిండియా: తుది జట్టులో భారీ మార్పులు?

కామెంట్రీ బాక్స్‌లో భిన్నమైన దృశ్యాలు
ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో హ్యారీ బ్రూక్ సెంచరీ చేసిన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీ క్రికెటర్ల స్పందనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఆనందంతో గంతులు వేస్తూ మైక్ ముందు హ్యారీ బ్రూక్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బ్రూక్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ ఆయన చేసిన కామెంటరీ ఇంగ్లాండ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Harry Brook Century Stuns Pakistan Legends Wasim Akram and Ramiz Raja Reaction Video Goes Viral

మూగబోయిన వసీం అక్రమ్, రమీజ్ రాజా
అయితే అదే సమయంలో నాసిర్ హుస్సేన్ పక్కనే కూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు వసీం అక్రమ్, రమీజ్ రాజాల ముఖాలు ఒక్కసారిగా వాడిపోయాయి. ఓ వైపు నాసిర్ హుస్సేన్ సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు ఈ ఇద్దరు పాక్ మాజీలు నోట మాట రాక నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంగ్లాండ్ విజయం ఖాయమవడంతో వారి ముఖాలు పాలిపోయినట్లు ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారంటూ నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
పాకిస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నీ తానై ఇన్నింగ్స్‌ను నడిపించారు. మొత్తం 51 బంతుల్లో 100 పరుగులు చేసిన బ్రూక్.. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఆయన మెరుపు దాడికి పాక్ బౌలర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టీమిండియాకు గుడ్ న్యూస్.. హిట్టింగ్ హీరో ఈజ్ బ్యాక్!టీమిండియాకు గుడ్ న్యూస్.. హిట్టింగ్ హీరో ఈజ్ బ్యాక్!

పాకిస్థాన్ వైఫల్యం.. షాహీన్ అఫ్రిది ఫైట్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (63) మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయారు. బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ తలో 25 పరుగులకే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో అదరగొట్టారు. లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది 4 వికెట్లు తీసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. హ్యారీ బ్రూక్ వీరవిహారంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Wednesday, February 25, 2026, 14:42 [IST]
Other articles published on Feb 25, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+