Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఇది కేవలం ఆరంభం మాత్రమే'

Harmanpreet thrilled after historic hundred at Womens World T20: Just the beginning

హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత బోణీకి హర్మన్ సెంచరీ చక్కటి తోడ్పాటు అందించింది. భారత ఇన్నింగ్స్‌లో వందకు పైగా పరుగులతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్‌ హర్మన్.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటోంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించింది.

భారత్‌ 34 పరుగుల తేడాతో విజయం

భారత్‌ 34 పరుగుల తేడాతో విజయం

హర్మన్ బ్యాటింగ్‌లో ఉండగా... జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు)తో మరో ఎండ్‌లో సత్తా చాటడంతో పాటు హర్మన్‌కు మంచి సహకారాన్ని అందించింది. దీంతో భారత్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హర్మన్‌ ప్రీత్‌ మాట్లాడింది.

ఒకరు హిట్టింగ్‌ చేస్తే.. మరొకరు స్ట్రైక్‌ రొటేట్‌

ఒకరు హిట్టింగ్‌ చేస్తే.. మరొకరు స్ట్రైక్‌ రొటేట్‌

‘తొలి మ్యాచ్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జట్టుగా కూడా ఇంకొంచెం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నేను క్రీజులో సెట్టైతే.. షాట్స్‌ ఆడగలను. మరో ఎండ్‌లో జెమీమా అద్భుతంగా ఆడింది. ఒకరు హిట్టింగ్‌ చేస్తే.. మరొకరు స్ట్రైక్‌ రొటేట్‌ చేయాలి. ఆ బాధ్యతను జెమీమా తీసుకుంది.'అని అభిప్రాయపడింది.

 హర్మన్‌-జెమీమా నాలుగో వికెట్‌కు అత్యధికంగా

హర్మన్‌-జెమీమా నాలుగో వికెట్‌కు అత్యధికంగా

భారత సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తమ జట్టుకు కీలకమని, తొలి ఆరు ఓవర్లలో ఆమె అంతగా పరుగులు చేయలేదని, ఆ తరువాత బ్యాటింగ్‌ చేస్తే ఆమె రాణించగలదని హర్మన్‌ అభిప్రాయపడింది. హర్మన్‌-జెమీమా నాలుగో వికెట్‌కు అత్యధికంగా 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్‌ హర్మన్‌ బౌండరీలతో బిజీగా ఉండగా.. జెమీమా స్ట్రైక్‌ రోటెట్‌ చేసింది.

రమేశ్‌ పవార్‌ పూర్తిగా ఆలోచనా విధానాన్ని

రమేశ్‌ పవార్‌ పూర్తిగా ఆలోచనా విధానాన్ని

ఈ మ్యాచ్ విజయంలో క్రెడిట్‌ అంతా జెమీమాదేనన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక బౌలింగ్‌ విభాగంలో తాము కొంత మెరుగవ్వాలని సూచించింది. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో మా బౌలింగ్‌ నైపుణ్యం ఇంకా మెరుగుపడాల్సి ఉన్నట్లు తెలిపింది. హెడ్‌కోచ్‌ రమేశ్‌ పవార్‌ పూర్తిగా తమ ఆలోచనా విధానాన్ని మార్చేసాడని, ఇది తమకెంతో ఉపయోగపడిందని, ఆయన తమ జట్టులో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

Story first published: Saturday, November 10, 2018, 13:05 [IST]
Other articles published on Nov 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+