For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి మొండిచేయి: హర్మన్‌ప్రీత్, కుల్దీప్, చాహల్‌లకే అవార్డులు

By Nageshwara Rao
Harmanpreet, Kuldeep and Yuzvendra top gainers at ESPNCricinfo awards

హైదరాబాద్: ఈఎస్‌పీఎన్‌-క్రిక్‌ ఇన్ఫో వార్షిక పురస్కారాల్లో భారత క్రికెటర్లు అవార్డులు దక్కించుకున్నారు. మొత్తం 12 విభాగాలకు గాను ప్రకటించిన మొత్తం పది వార్షిక అవార్డుల్లో మూడింటిని భారత క్రికెటర్లు దక్కించుకున్నారు. మహిళల క్రికెట్‌ వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్‌, మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌‌లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.

గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్ 171 పరుగులతో నాటౌట్‌గా తన కెరీర్‌‌లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. అంతేకాదు ఈ టోర్నీలో మిథాలీరాజ్ నేతృత్వంలోని టీమిండియా రన్నరప్‌గా నిలిచింది.

ఈ ప్రదర్శనకు గాను హర్మన్ ప్రీత్ కౌర్‌ 'ఉమెన్స్‌ బ్యాటింగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డుకు ఎంపికైంది. గతేడాది బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన యజువేంద్ర చాహల్‌ 'టీ20 బౌలింగ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు లభించింది.

ఆస్ట్రేలియాతో ధర్మశాల టెస్టులో అరంగేట్రం చేసిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు 2017కు గాను అరంగేట్రం బౌలర్‌ అవార్డుకి ఎంపికయ్యాడు. అరంగేట్రం నుంచి అతడు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 43 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌కు రెండు, ఆస్ట్రేలియాకు రెండు, పాకిస్థాన్‌కు రెండు, వెస్టిండిస్‌కు ఓ అవార్డు లభించింది.

మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అవార్డుని వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి హేథర్‌ నైట్‌‌కు దక్కగా... అన్య ష్రబ్‌సోల్‌కు అత్యత్తుమ బౌలింగ్‌ ప్రదర్శన అవార్డు లభించింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పుణె టెస్టులో టీమిండియాపై 109 పరుగులు చేసిన స్మిత్‌కు, ఇదే పర్యటనలో బెంగళూరు టెస్టులో 8/50 ప్రదర్శన చేసిన బౌలర్‌ నాథన్ లయాన్‌కు అవార్డులు దక్కాయి.

వెస్టిండీస్‌ ఇవిన్‌ లూయిస్‌కు టీ20 విభాగంలో, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో రాణించిన ఫకర్‌ జమాన్‌, మహ్మద్‌ ఆమిర్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే 2017లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కక పోవడం విశేషం.

Story first published: Tuesday, February 20, 2018, 10:22 [IST]
Other articles published on Feb 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+