Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌ ప్రీత్‌ మ్యాజిక్‌ ట్రిక్.. పరేషాన్‌లో ఫాన్స్ (వీడియో)

Harmanpreet Kaurs Magic Trick Leaves Fans Stumped

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశ ప్రభుత్వాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు సైతం తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ‌తన మ్యాజిక్‌ ట్రిక్‌ను ప్రదర్శించింది.

 హర్మన్‌ మ్యాజిక్‌ ట్రిక్‌:

హర్మన్‌ మ్యాజిక్‌ ట్రిక్‌:

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఇంట్లోని ఓ అద్దం ముందు నిల్చుని మ్యాజిక్‌ ట్రిక్‌ను చేసింది. హర్మన్ కుడి చేతిలో ఓ గాజు గ్లాసు అందులో బాల్ పట్టుకొని నిల్చొని ఉంది. ఆ బంతిని ఎదురుగా ఉన్న అద్దం వైపు విసరగా.. అది మళ్లీ హర్మన్‌ వైపు రావడం గ్లాస్‌లో పడటం జరిగింది. అవతలి వైపు గ్లాస్‌లోకి వెళ్లి అక్కడ్నుంచి మళ్లీ హర్మన్‌ గ్లాస్‌లోకి రావడం ఇక్కడ మ్యాజిక్‌గా నిలిచింది. ఈ వీడియోను హర్మన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'మిర్రర్, గోడపై అద్దం, ఇందులో ఎవరు నిజం' అని హర్మన్ కాప్షన్ రాసుకొచ్చింది.

అభిమానులకు పజిల్‌:

అభిమానులకు పజిల్‌:

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎలా చేశానో చెప్పాలంటూ హర్మన్‌.. అభిమానులకు పజిల్‌ విసిరింది. అయితే అభిమానులు మాత్రం అది ఎలా సాధ్యం​ అనే విషయంలో పరేషాన్‌ అవుతున్నారు. హర్మన్‌ విసిరిన మ్యాజిక్‌ ట్రిక్‌ను కనుక్కొనే పనిలో తలలు పట్టుకుని అన్వేషణ సాగిస్తున్నారు. ప్రస్తుతం హర్మన్‌ మ్యాజిక్‌ ట్రిక్‌కు బౌల్డ్‌ అయిన ఫ్యాన్స్‌.. ఇందులోని అసలు విషయాన్ని కనుక్కునే పనిలో పడ్డాడు.

బీసీసీఐ ఏమంటుందో:

బీసీసీఐ ఏమంటుందో:

లాక్‌డౌన్‌ కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్న టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవల తనకు తెలిసిన ట్రిక్స్‌తో అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. హౌస్‌ మాజీషియన్‌గా మారిపోయి కార్డ్‌ ట్రిక్‌ షోను ప్రదర్శించి.. బీసీసీఐని సైతం అబ్బుర పరిచాడు. ఇలా కార్డ్‌ ట్రిక్‌ ద్వారా నవ్వులు తెప్పించిన అయ్యర్‌ వీడియోకు థాంక్యూ చాంపియన్‌ అం​టూ బీసీసీఐ క్యాప్షన్‌ ఇచ్చింది. మరి ఇప్పుడు హర్మన్‌ ప్రీత్‌ తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోకు బీసీసీఐ ఏమంటుందో చూడాలి.

ప్రపంచకప్‌లో విఫలం:

ప్రపంచకప్‌లో విఫలం:

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్ ‌ప్రీత్‌ సేన 85 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. దీంతో తొలిసారి మెగా టోర్నీ ముద్దాడాలన్న కల అందని ద్రాక్షే అయింది. హర్మన్ ‌ప్రీత్‌, మందాన ఇద్దరు విఫలమవడంతో కప్ చేజారింది.

Story first published: Thursday, April 23, 2020, 13:06 [IST]
Other articles published on Apr 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+