హర్మన్ దూరం: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత మహిళల జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చీలమండ గాయం కారణంగా భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి వైదొలగింది. పటియాలాలో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడింది.
హర్మన్ ప్రీత్ స్థానంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హర్లీన్ డియోల్‌ను తొలిసారి జట్టులోకి ఎంపిక చేశారు. పంజాబ్‌లో జన్మించిన 20 ఏళ్ల హర్లీన్ దేశవాళీ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడుతుంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 22, 25, 28వ తేదీల్లో భారత్ మూడు వన్డేలు ఆడుతుంది.
ఈ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 22న ముంబై వేదికగా జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనుంది. మార్చి 4న మొదలయ్యే టీ20 సిరీస్ నాటికి హర్మన్ కోలుకోకపోతే ఆమె స్థానంలో స్మృతీ మంధానా భారత జట్టుకు నాయకత్వం వహించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications