Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ ఓటమికి అసలు కారణం అదే: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. లభించిన అవకాశాలను చేజార్చుకోవడం వల్లే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకుంది. "మ్యాచ్ మధ్యలో మాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ మేము వాటిని అందుకోలేకపోయాం. అయితే టోర్నమెంట్‌లో మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో మేము పాజిటివ్‌గా ఉంటూ.. రాబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం" అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.

మారిజాన్ కాప్ ఇన్నింగ్స్ టర్నింగ్ పాయింట్
దక్షిణాఫ్రికా జట్టును విజయతీరాలకు చేర్చిన మారిజాన్ కాప్ ఇన్నింగ్స్‌ను హర్మన్‌ప్రీత్ ప్రశంసించింది. అయితే ఆమె ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారని గుర్తు చేసింది. "ఈరోజు కాప్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకుంది. అయితే ఆమె బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాకు రెండు కీలక ఛాన్సులు లభించాయి. ఈ స్థాయి క్రికెట్‌లో లభించిన అవకాశాలను వదిలేస్తే ఎవరూ మనకు విజయాన్ని ఊరికే ఇవ్వరు. సరిగ్గా అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది" అని చెప్పింది. అలాగే బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. పిచ్‌పై బంతి కాస్త టర్న్ అవుతున్న సమయంలో శ్రీ చరణి, షఫాలీ వర్మలు అద్భుతంగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లకు సవాల్ విసిరారని, కానీ మిగతా బౌలర్ల నుంచి వారికి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించలేదని కెప్టెన్ అభిప్రాయపడింది. ఇలాంటి పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో మిగతా స్పిన్నర్లు కూడా ఆలోచించుకోవాలంది.

Harmanpreet Kaur Reveals Real Reason Behind India s Defeat Against South Africa in T20 World Cup 2026

200వ టీ20 మ్యాచ్ మైల్‌స్టోన్
తన కెరీర్‌లో 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ మైల్‌స్టోన్‌ను అందుకోవడంపై, మహిళల క్రికెట్ వృద్ధిపై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో సానుకూల క్షణాలతో పాటు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బలంగా ఎలా నిలబడాలి, సానుకూల దృక్పథంతో ఆట గురించి ఎలా ఆలోచించాలనేది క్రికెట్ నాకు నేర్పింది. ఒక కెప్టెన్‌గా ఇప్పుడు నా జట్టు సభ్యులతో మాట్లాడి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన సమయం ఇది. రాబోయే తదుపరి మ్యాచ్‌కు ఇంకా రెండు మూడు రోజుల సమయం ఉంది. మేము అందరం కలిసి కూర్చొని ఎక్కడ లోపాలు జరిగాయో సమీక్షించుకుంటాం. దానికి తగ్గట్టుగా తదుపరి మ్యాచ్‌కు అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తాం. రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక జట్టుగా మేము బలంగా పుంజుకుంటామనే నమ్మకం నాకు ఉంది" అని హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Story first published: Sunday, June 21, 2026, 23:02 [IST]
Other articles published on Jun 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+