Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిథాలీకి షాక్: కెప్టెన్‌గా కౌర్, ఏపీలో వెస్టిండిస్‌ సిరిస్

న్యూఢిల్లీ: టీమిండియా మహిళా టీ20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్ధానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌‌ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో వెస్టిండిస్‌తో జరిగే వన్డే, ట్వంటీ20 సిరిస్‌తో పాటు ఆసియా కప్ టీ20 టోర్నీ కోసం మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండివెస్టిండిస్‌తో వచ్చే నెల 18 నుంచి జరిగే టీ20 సిరిస్‌తో పాటు నవంబర్ 27 నుంచి థాయ్‌లాండ్‌లో జరిగే ఆసియా టీ20 టోర్నమెంట్‌కు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా కొనసాగుతారు. నవంబర్ 27 నుంచి థాయిలాండ్‌లో ఆసియా టి20 కప్ మొదలవుతుంది. ఇది డిసెంబర్ 5 వరకు జరుగుతుంది.

అయితే వచ్చే నెల 10 నుంచి 16 వరకు వెస్టిండిస్‌తో జరిగే వన్డే సిరిస్‌కు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగనుంది. వన్డేలతో పాటు టీ20 సిరిస్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ విజయవాడకు సమీపంలోని మూలపాడులో జరుగుతాయి.

కాగా, ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోని మహిళా జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటి వరకు 61 టీ20 మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. 992 పరుగులు సాధించింది. అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.

Harmanpreet Kaur Replaces Mithali Raj as India Women's T20 Captain

ఇక టీ20ల్లో కౌర్ అత్యధిక స్కోరు 77. అయితే టీ20లతో పోలిస్తే వన్డేల్లో కౌర్ రికార్డు మరింత మెరుగ్గా ఉంది. 55 వన్డేలు ఆడిన హర్మన్‌ 35.57 యావరేజితో 1494 పరుగులు సాధించింది. వన్డేల్లో ఈమె అత్యధిక స్కోరు 107 నాటౌట్. అందులో రెండు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఆసియా కప్‌కు భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రుతి మధన, మిథాలీ రాజ్, ఎస్ మేఘన, వనితా, అనుజ పాటిల్, వేద కృష్ణమూర్తి, సుష్మా వర్మ, పర్వీన్, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్ట్, ప్రీతి బోస్, ఝులన్ గోస్వామి, శిఖా పాండే, మన్షీ జోషి.

భారత వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రుతి మధన, తిరుష్ కామిని, మోనా మేష్రం, వేద కృష్ణమూర్తి, దేవికా వైద్యా, సుష్మా వర్మ, ఝులన్ గోస్వామి, శిఖా పాండే, సుకన్య పరీదా, ఏక్తా బిస్ట్, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ.

భారత టి20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రుతి మధన, మిథాలీ రాజ్, ఎస్ మేఘన, వనితా, అనుజ పాటిల్, దీప్తి శర్మ, పర్వీన్, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్ట్, ప్రీతి బోస్, వేద కృష్ణమూర్తి, ఝులన్ గోస్వామి, శిఖా పాండే, మన్షీ జోషి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+