Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 World Cup : ఇంత కన్నా చెత్త ఫీలింగ్ మరొకటి లేదు: హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur reacts on semifinal loss to Australia

మహిళల టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ సిరీస్ అంతా అద్భుతంగా ఆడిన భారత్.. గ్రూప్ దశలో కేవలం ఇంగ్లండ్ చేతిలోనే ఓటమిపాలైంది. మిగతా అన్ని మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసింది. ఇలా అద్భుతమైన ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 172 పరుగుల భారీ స్కోరు చేసింది.

కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్..

కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్..

లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ విఫలమైంది. టోర్నీ అంతా అద్భుతంగా రాణించిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఫెయిలైంది. ఇలాంటి సమయంలో జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరూ భారత జట్టును ఆదుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ అవుటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రెండో పరుగు తీసే సమయంలో ఆమె బ్యాట్ నేలలో దిగబడి ముందుకు జారలేదు. దీంతో ఆమె రనౌట్ అయ్యి పెవిలియన్ చేరింది. చివర్లో భారత్ ఓడిపోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

ఇంత కన్నా దురదృష్టం లేదు..

ఇంత కన్నా దురదృష్టం లేదు..

ఈ ఓటమి గురించి మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. ‘ఇంత కన్నా దురదృష్టం ఉంటుందని అనుకోవడం లేదు. జెమీతో కలిసి ఆడేటప్పుడు మ్యాచ్ మా వైపే ఉందని అనుకున్నా. అలాంటి పరిస్థితి నుంచి ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. అలా రనౌట్ అవడం కన్నా దురదృష్టకర ఘటన మరొకటి నా జీవితంలో జరగలేదు. అయితే చివరి బంతి వరకు పోరాడినందుకు సంతోషిస్తున్నా. మొదటి రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా.. మా దగ్గర బ్యాటింగ్ ఉందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పుకొచ్చింది.

జెమీమాను మెచ్చుకోవాలి..

అలాగే మ్యాచ్ మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడిన మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్‌(43)ను మెచ్చుకుంది. ‘మ్యాచ్‌ను మా వైపు తిప్పినందుకు జెమీమాను మెచ్చుకోవాలి. ఆమె మా జట్టుకు మొమెంటం తీసుకొచ్చింది. ఓవరాల్‌గా మేం మంచి క్రికెట్ ఆడాం. మేం కూడా ఛేజ్ చేయాలనే అనుకున్నాం. కాబట్టి టాస్ ఓడి బౌలింగ్ చేసినా ప్రాబ్లం అనిపించలేదు. ఈరోజు మా సహజమైన ఆట ఆడాలని అనుకున్నాం.

కొంతమంది మాత్రమే అది చెయ్యగలిగారు' అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. కొన్ని సులభమైన క్యాచులు వదిలేయడం గురించి మాట్లాడుతూ.. మ్యాచులు గెలవాలంటే అలాంటి అవకాశాలను చేజార్చకూడదని, కానీ తాము ఆ పని చేయలేకపోయామని అభిప్రాయపడింది.

Story first published: Friday, February 24, 2023, 7:00 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+