గాయంతోనే ఫైనల్ వరకు: హర్మన్ ఆసక్తికర విషయం
హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్‌తో హర్మన్ ప్రీత్ కౌర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 171 పరుగులతో ఆజేయంగా నిలిచి టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో మిథాలీ సేన 9 పరుగుల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్, ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ తన ప్రదర్శనతో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. తాజాగా వరల్డ్ కప్ విశేషాలను మీడియాతో పంచుకుంటూ గాయంతో తాను టోర్నీ మొత్తం ఆడిన విషయాన్ని వెల్లడించింది.

ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమచేతి వేలికి గాయం
‘టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా నా ఎడమచేతి వేలికి తీవ్ర గాయమైంది. ప్రథమ చికిత్స చేసిన అనంతరం జట్టు ఫిజియో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. కానీ.. అప్పటికి భారత్ జట్టు సురక్షితమైన స్థితిలో లేదు. దీంతో నొప్పిని భరిస్తూ బౌలింగ్ చేశాను. ఈ మ్యాచ్‌లో నాకు రెండు వికెట్లు దక్కాయి' అని హర్మన్ పేర్కొంది.

ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు
'సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆ గాయంతోనే టోర్నీ మొత్తం ఆడాను' అని హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించింది. 'సెమీఫైనల్, ఫైనల్లో బ్యాటింగ్ చేసే సమయంలో ధరించిన గ్లౌజ్‌ల వల్ల గాయం నొప్పి తీవ్రంగా బాధించింది' అని హర్మన్ చెప్పింది.

దేశం తరుపున ఆడుతున్నా
'దేశం తరఫున టోర్నీలో ఆడుతున్నాను. నొప్పిని భరించాలి అని పదే పదే అనుకునేదాన్ని. ఒకానొక సమయంలో టోర్నీ మధ్యలో ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ, నా ఫిజియో ట్రేసీ కారణంగా నేను టోర్నీ మొత్తం ఆడగలిగాను' అని హర్మన్ వెల్లడించింది.

వంకరగా మారిన హర్మన్ చేతి వేలు
‘గాయంతో హర్మన్‌ప్రీత్ చేతి వేలు వంకరగా మారింది. దీంతో వేలు సాధారణ స్థితికి వచ్చేందుకు డాక్టర్లు ఒక క్లాంప్‌ని అమర్చారు' అని ఆమె తండ్రి హర్మందర్ బుల్లార్ వివరించారు. కాగా భుజం నొప్పి, వేలి గాయం కారణంగా హర్మన్ ఆగస్టు 10 నుంచి ఇంగ్లాండ్‌లో జరగనున్న ఉమెన్ సూపర్ సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications