For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా సఫారీ పర్యటనకు టీ20 జట్టు ఎంపిక

By Nageshwara Rao
Harmanpreet Kaur to lead India in the T20Is against SA

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల టీ20 సిరీస్‌కు సెలక్టర్లు సోమవారం టీమిండియాను ప్రకటించారు. ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరిస్‌కు భారత మహిళల జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను స్మృతి మందానకు అప్పగించారు.

ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఈ టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో టీ20 స్పెషలిస్ట్ అనూజా పాటిల్‌‌తో పాటు రాధా యాదవ్‌, వికెట్‌ కీపర్‌ నుజహత్‌ పర్వీన్‌ను చోటు దక్కించుకున్నారు.

అండర్‌-19 టోర్నీలో 163 బంతుల్లో 202 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగెజ్‌ కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఇక, వన్డే జట్టులో ఉన్న మోనా మెష్రమ్‌, వికెట్‌ కీపర్‌ సుష్మ వర్మ, ఏక్తా బిష్ట్, పూనమ్‌లకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్‌, వేద కృష్ణమూర్తి, జెమీమా రోడ్రిగెజ్‌, దీప్తి శర్మ, అనూజ పాటిల్‌, తానియా భాటియా, పర్వీన్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, జులన్‌ గోస్వామి, శిఖ పాండే, పూజా వస్త్రకర్‌, రాధా యాదవ్‌.

షెడ్యూల్:
Ist T20I: February 13: Potchefestroom
2nd T20I: February 16: East London
3rd T20I:
February 18: Johannesburg
4th T20I: February 21: Centurion
5th T20I: February 24: Cape Town

Story first published: Wednesday, January 24, 2018, 8:24 [IST]
Other articles published on Jan 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+