న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతోన్న టీమిండియా

Harmanpreet Kaur is up for the challenge as captain, says Anjum Chopra

హైదరాబాద్: ఓ వైపు వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంటే భారత క్రికెట్ మహిళా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఉమెన్స్ టీ20లో భాగంగా వెస్టిండీస్‌కు చేరుకుంది. టీ20 జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న హర్మన్ ప్రీత్ బృందం తాము చేరుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఉమెన్స్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 10 రోజుల్లో టీ20 ఫార్మాట్‌లో మహిళల మహాసంగ్రామం ఆరంభం కానుంది.

చరిత్ర తిరగరాయాలని పట్టుదలతో

చరిత్ర తిరగరాయాలని పట్టుదలతో

ఈ ప్రపంచ కప్ సమరంలో భారత జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్‌కు సవాల్‌కు సై అంటోంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలవలేకపోయిన భారత మహిళల టీమ్ ఈ సారి చరిత్ర తిరగరాయాలని పట్టుదలతో ఉంది. జట్టు పరంగా సాధించలేకపోయినా విదేశాల్లో దేశీవాలీ లీగ్ లు ఆడుతున్న మహిళా ప్లేయర్లు ఇంగ్లాండ్ గడ్డపై బౌండరీలు బాదిన రికార్డులు లేకపోలేదు.

మహిళా క్రికెట్‌పై మరింత ఆదరణ

మహిళా క్రికెట్‌పై మరింత ఆదరణ

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ ఇలా మాట్లాడారు. 'భారత్‌లో మహిళా క్రికెట్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఈ టోర్నమెంట్ భారత మహిళా క్రికెట్‌కు మరో చక్కటి అవకాశం లాంటిది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రొమోలను టీవీలలోనూ ప్రసారాలు చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ నుంచి మహిళా క్రికెట్‌పై మరింత ఆదరణ పెరుగుతుందని' భావిస్తున్నాను.

 భారత్ ఓపెనింగ్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో

భారత్ ఓపెనింగ్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2018 నవంబరు 9 నుంచి అదే నెల నవంబరు 24వ తేదీ వరకూ కొనసాగనుంది. గ్రూపులుగా పాల్గొంటున్న నేపథ్యంలో భారత్ గ్రూపు బీలో భాగమైంది. ఇదే గ్రూపులో ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లున్నాయి. ఈ క్రమంలో భారత్ తన ఓపెనింగ్ మ్యాచ్ నవంబరు 9న న్యూజిలాండ్‌ను ఢీ కానుంది.

మిథాలీ రాజ్‌కు ఆఖరి టీ20 వరల్డ్ కప్

మిథాలీ రాజ్‌కు ఆఖరి టీ20 వరల్డ్ కప్

కరీబియన్ దీవుల్లో జరుగనున్న ఉమెన్స్ టీ 20 వరల్డ్‌కప్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసిసిఐ ) 15 మంది సభ్యుల భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ ,స్మృతి మంధన మిథాలీ రాజ్, జెమిమా రోడ్రిగెస్, వేదా కృష్ణమూర్తి,ఏక్తా బిష్ట్,పూనమ్ యాదవ్ వంటి టాప్ క్లాస్ క్రికెటర్లతో పటిష్టంగా ఉంది. భారత సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్ కప్ కావొచ్చు.

Story first published: Wednesday, October 31, 2018, 15:17 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X