కోహ్లీ తరహాలో దూకుడు: 'కౌర్ ఆదర్శ క్రికెటర్ ఎవరంటే!'
హైదరాబాద్: 'వీరేంద్ర సెహ్వాగ్‌లా బ్యాటింగ్, కోహ్లీలోని దూకుడు రెండు కలిపితే హర్మన్ ప్రీత్ సింగ్' హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఆమె సోదరి హెమ్‌జిత్ చేసిన వ్యాఖ్యలివి. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సూపర్ సెంచరీతో భారత్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ ఫైనల్స్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో ఆమె కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించడంలో హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది.
ఈ సందర్భంగా ఆమె సోదరి హెమ్‌జిత్ మీడియాతో మాట్లాడింది. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌కు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ఎంతో ఆదర్శమట. తన క్రికెట్ కెరీర్‌లో సెహ్వాన్‌ను బ్యాటింగ్ ఐడల్‌గా తీసుకునే హర్మన్ పెరిగిందని ఆమె సోదరి హెమ్ జిత్ తెలిపింది.

బాల్యం బాయ్స్‌తోనే ఎక్కువగా క్రికెట్ ఆడేది
'హర్మన్ బాల్యం నుంచి చూస్తే బాయ్స్‌తోనే ఎక్కువగా క్రికెట్ ఆడేది. ఎప్పుడూ పరుగుల కోసం పరితపిస్తూ స్ట్రయిక్ రేటుని మెరుగ్గా ఉంచుకునేది. హర్మన్ ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుంది. మైదానంలో విరాట్ కోహ్లీ తరహాలో దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఇక ఆఫ్ ఫీల్డ్‌లో విషయానికి వస్తే ఆమె కూల్‌గా ఉండేది' అని ఆమె సోదరి తెలిపింది.

ఆరాధ్య క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
'ఆమె ఆరాధ్య క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగే. సెహ్వాగ్ ఆటను ఎక్కువగా ఆస్వాదించేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడిన ఇన్నింగ్స్‌ని లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌తో పోల్చడం మాకెంతో గర్వంగా ఉంది' అని పేర్కొంది.

తండ్రే రోల్ మోడల్
'ఇక హర్మన్ రోల్ మోడల్ విషయానికొస్తే తండ్రి హర్మందర్ సింగ్. మా నాన్నే హర్మన్ తొలి కోచ్. మా నాన్న మంచి క్రికెటర్. కానీ ఇబ్బందులు కారణంగా ఆటలో ముందుకు వెళ్లలేకపోయారు. అతని కల హర్మన్ ప్రీత్ రూపంలో నిజమైంది' అని హెమ్‌జిత్ తెలిపింది.

తామెంతో గర్విస్తున్నాం
హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన ఈ ఘనతకు తామెంతో గర్వంగా ఉన్నాం. యావత్ జాతి ఆమెను చూసి గర్విస్తోంది. ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఆరు బయట హర్మన్ ప్రీత్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆమెను చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది' అని కౌర్ సోదరి హెమ్‌జిత్ పేర్కొంది. ఇక స్వతహాగా ఇంగ్లీషు టీచర్ అయిన హెమ్‌జిత్ తన సోదరి సాధించిన విజయాల పట్ల తామంతా గర్వంగా ఉన్నట్లు వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications