Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్ దూకుడు.. జర్నలిస్టుకు తప్పిన ప్రమాదం

India’s T20 captain Harmanpreet Kaur

హైదరాబాద్: మ్యాచ్ జరిగేది ఇంగ్లాండ్‌లో అయినా ఇరు జట్లలో ఆడేది ఇండియన్ క్రికెటర్లే. కియా సూపర్ లీగ్ పేరిట టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్.. స్మృతి మంధానను విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్‌లలో జట్టులలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ.. ప్రత్యర్థి జట్టుకు ముచ్చెటమలు పోయిస్తోంది మంధాన. అయితే ఆమెకు ధీటుగా హర్మన్‌ప్రీత్ దూకుడును పెంచింది. ఇలా భారత మహిళా క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కియా సూపర్ లీగ్(కేఎస్‌ఎల్)లో దుమ్మురేపుతున్నారు.

వరుస మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్న స్మృతి మంధానకు దీటుగా భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడుతోంది. లీగ్‌లో లంకషైర్ థండర్ తరఫున ఆడుతున్న కౌర్ టోర్నీలో తొలి ఆఫ్‌సెంచరీ సాధించింది. 29ఏళ్ల హర్మన్‌ప్రీత్ 44 బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్ల సాయంతో 74 పరుగులతో రాణించింది. దాంతో లంకషైర్ జట్టు 9 పరుగుల తేడాతో యార్క్‌షైర్ డైమండ్స్‌పై విజయం సాధించి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

హర్మన్ బాదిన బంతి ఒకటి బీబీసీ జర్నలిస్ట్‌కు సమీపం నుంచి వెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లంకషైర్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆమె ఆరంభంలో నిదానంగా ఆడి.. ఆఖర్లో రెచ్చిపోయింది. ఈక్రమంలోనే బంతి నేరుగా వెళ్లి విండ్‌స్క్రీన్‌కు తగలడంతో జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్ స్టువర్ట్ ఫ్లిండర్స్ సురక్షితంగా బయటపడ్డారు.

లాంకషైర్ థండర్ 154/9 జట్టు చేసిన స్కోరును యాక్‌షైర్ డైమండ్స్ 145/8 .. 20 ఓవర్లు పూర్తయ్యేలోపు చేధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బౌలర్లను శాసిస్తూ ఆడిన తీరు ధోనీని పోలి ఉందంటూ ప్రశంసలు సైతం అందుకుంది.

Story first published: Wednesday, August 15, 2018, 19:59 [IST]
Other articles published on Aug 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+