Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్: "లేడీ క్యాప్టెన్ కూల్" రికార్డు!

Harmanpreet Kaur: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో పురుషుల జట్టు సాధించిన అద్భుతాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు పునరావృతం చేసింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఓ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు
మహిళల క్రికెట్ చరిత్రలో హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే అంతర్జాతీయ (ODI) ప్రపంచ కప్‌ను గెలిచిన అత్యధిక వయస్సు గల కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 36 సంవత్సరాల, 239 రోజుల వయస్సులో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మహిళల క్రికెట్‌లో ఏ కెప్టెన్ కూడా ఇంత ఎక్కువ వయస్సులో ప్రపంచ కప్‌ను గెలుచుకోలేదు.

Harmanpreet Kaur Creates History Lady Captain Cool Leads India to ICC Womens World Cup Glory

బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర
మహిళల ప్రపంచ కప్ 2025లో హర్మన్‌ప్రీత్ తన బ్యాటింగ్‌తో కూడా జట్టుకు అండగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో హర్మన్‪ప్రీత్ కౌర్ 9 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 32.50 సగటుతో మొత్తం 260 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 89.04గా ఉంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ రికార్డును కూడా హర్మన్‌ప్రీత్ అధిగమించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ కామెంట్స్
చారిత్రక విజయం తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది. "ఇది ఒక గొప్ప విజయం, ఈ ఘనత మొత్తం జట్టు కృషికి దక్కుతుంది. బీసీసీఐ, సహాయక సిబ్బంది జట్టుపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఇది ముగింపు కాదు, మొదలు మాత్రమే. వచ్చే ఏడాది మరో ప్రపంచ కప్ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాము." అని ఆమె అన్నారు.

1983 వరల్డ్ కప్‌తో పోలిక
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ విజయాన్ని 1983లో పురుషుల జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలో సాధించిన ప్రపంచ కప్ విజయంతో పోల్చారు. "భారత మహిళల క్రికెట్‌కు ఇది ఒక చిరస్మరణీయమైన రోజు. 1983లో పురుషుల జట్టు సాధించిన ఘనతను భారత మహిళలు ముంబైలో పునరావృతం చేశారు. ఈ చారిత్రక విజయం దేశంలో మహిళల క్రికెట్‌కు భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చి, కొత్త శిఖరాలను చేరుకునేలా చేస్తుంది." అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.

Story first published: Monday, November 3, 2025, 10:33 [IST]
Other articles published on Nov 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+