Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : మేం అనుకున్నదే జరిగింది.. చాలా సంతోషంగా ఉంది : హర్మన్‌ప్రీత్

Harmanpreet happy about their game plan in first WPL 2023 game

మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. హర్మన్‌ప్రీత్ కౌర్ (65), అమీలియా కెర్ (45 నాటౌట్), హేలీ మాథ్యూస్ (47) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంత భారీ స్కోరును ఛేదించడంలో గుజరాత్ దారుణంగా ఫెయిలైంది.

ఛేజింగ్‌లో గుజరాత్ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. మొదటి నలుగురు బ్యాటర్లలో ముగ్గురు కనీసం ఖాతా కూాడా తెరవకుండానేే పెవిలియన్ చేరారు. దీన్ని బట్టే గుజరాత్ బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో అర్తం చేసుకోవచ్చు. చివరకు ఈ జట్టు 15.1 ఓవర్లలో 64 పరుగులకు ఆలౌట్ అయింది. దీనిపై స్పందించిన హర్మన్‌ప్రీత్.. 'ఇదొక అద్భుతమైన ఆరంభం.

Harmanpreet happy about their game plan in first WPL 2023 game

నేను కన్న కలలు నిజమైనట్లు అనిపించింది. అన్నీ అనుకున్నట్లు జరిగి మొదటి మ్యాచ్ మేమే గెలవాలని అనుకున్నా. అదే జరడగం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపింది. అలాగే ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అని మాకు అర్థమైందని, ప్రత్యర్థి బౌలింగ్ చూసిన తర్వాత ఇక్కడ ఆడటం అంత ఈజీ కూడా కాదని అర్థమైందని హర్మన్ వివరించింది.

'మా ఆటలో మరీ క్లిష్టమైన విషయాల జోలికి పోలేదు. ఎవరూ ఇలా ఆడాలని చెప్పలేదు. అందర్నీ పిలిచి తమ సహజమైన ఆట ఆడాలని మాత్రమే చెప్పాం. ఇది మహిళల క్రికెట్‌కు చాలా పెద్ద విషయం. అందుకే ఆటగాళ్లను క్రీజులో తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలని, తమ ఆటపై నమ్మకం ఉంచుకోవాలని సూచించాం' అని హర్మన్ చెప్పింది. ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడటం గురించి మాట్లాడుతూ.. 'బంతిని జాగ్రత్తగా గమనించి, నా స్టైల్‌లో ఆడాలని అనుకున్నా. ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించా. అది నాకు కలిసొచ్చింది' అని చెప్పుకొచ్చింది.

Story first published: Sunday, March 5, 2023, 12:39 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+