Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా కౌర్: మహిళల వరల్డ్ టీ20కి భారత జట్టు ప్రకటన

Harmanpreet to captain India in ICC Womens World Twenty20; Mandhana appointed her debuty

హైదరాబాద్: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం భారత మహిళల జట్టును ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 9 నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్‌లతో కలిపి భారత్ గ్రూప్-బిలో ఉంది. భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహారించనుంది. వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ స్మృతి మందానను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబరు 9న భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.

11న పాకిస్థాన్, 15న ఐర్లాండ్, 17న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ గయానా వేదికగా జరగనున్నాయి.

ఐసీసీ వరల్డ్ టీ20లో ఆడే భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తాన్యా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, డి.హేమలత, మాన్షి జోషి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి

Story first published: Friday, September 28, 2018, 16:28 [IST]
Other articles published on Sep 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+