స్టన్నింగ్ క్యాచ్ పట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లాండ్ వుమెన్స్ చిత్తు

భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ 2-1తేడాతో భారత్ ఓడిపోయిన తర్వాత వన్డే సిరీస్లో రంగంలోకి దిగి శుభారంభంచేసింది. హోవ్‌లో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లాండ్ వుమెన్స్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అరంగేట్ర ప్లేయర్ అలిస్ క్యాప్సీ ఇచ్చిన క్యాచ్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా అందుకుంది.
ఒంటిచేత్తో ఈ క్యాచ్ పట్టడం మ్యాచ్ మలుపు తిప్పింది. స్నేహ రానా బౌలింగ్‌లో అలిస్ లెగ్ సైడ్ ఫ్లిక్ చేయగా.. దగ్గర్లో మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్ చాకచక్యంగా డైవ్ చేసి క్యాచ్ అందుకుంది. 19పరుగులకే క్యాప్సీ తన తొలి వన్డే ఇన్నింగ్స్ ముగించింది. ఇకపోతే ఈ సిరీస్లో వెటరన్ సీమర్ ఝులన్ గోస్వామి పేస్ విభాగానికి నాయకత్వం వహించింది.
భారత పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ చిత్తు
ఇక ఈ మ్యాచులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ 100పరుగులలోపే సగం వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ 2, స్నేహ రానా, హర్లీన్ డియోల్, మేఘన సింగ్, ఝులన్ గోస్వామి, గయాక్వడ్ తలా ఓ వికెట్ తీశారు. అయితే లోయర్ ఆర్డర్లో డి వైట్ (43), డేవిడ్సన్ రిచర్డ్ సన్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు చివర్లో ఎక్లెస్టన్ (31), చార్లెటిన్ డీన్ (24) కాస్త విలువైన పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 227పరుగులు చేయగలిగింది. దీంతో ఇండియా ముందు ఈజీ టార్గెట్ మిగిలింది.
మంధాన సెంచరీ మిస్
ఇకపోతే 228పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (91పరుగులు 99బంతుల్లో 10ఫోర్లు, 1సిక్సర్) మరోసారి ఛేజింగ్లో తన మార్క్ చూపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. అలాగే యాస్తికా భాటియాతో కలిపి మంధాన 96పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. యాస్తికా (47బంతుల్లో 50పరుగులు) కాస్త ధాటిగా ఆడింది. ఇక యాస్తికా ఔటయినప్పటికీ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74పరుగులు 94బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చింది. మంధాన, హర్మన్ కలిసి 99పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 44.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది.
తుది జట్లు :
ఇంగ్లాండ్ వుమెన్స్: ఎమ్మా లాంబ్, టామీ బ్యూమాంట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, డేనియల్ వ్యాట్, అమీ జోన్స్ (c & wk), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, షార్లెట్ డీన్, కేట్ క్రాస్, ఇస్సీ వాంగ్,
భారత వుమెన్స్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, యాస్తికా భాటియా (wk), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గయాక్‌వాడ్, మేఘనా సింగ్,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications