
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా వన్డే, టీ20 జట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఇకపోతే బుధవారం టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బీసీసీఐ అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక పర్యటనకు టీమిండియా జట్లను ఎంపిక చేయడానికి బుధవారం ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. భారత్ వరుసగా దంబుల్లా, క్యాండీ వేదికల్లో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
టీమిండియా మహిళల టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఎస్.మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్.
టీమిండియా మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజానా వస్త్రాకర్, మేఘనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.
ఇకపోతే భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించింది. ట్విట్టర్‌లో ఈ మేరకు రిటైర్మెంట్ ప్రకటన చేసింది. సుదీర్ఘకాలంగా తనకు అభిమానుల నుంచి అందుతున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని తెలిపింది. ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు ఉజ్వలంగా ఉందని, రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని పేర్కొన్న మిథాలీ.. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మహిళల క్రికెట్లో వన్డేల్లో మహిళల అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీరాజ్ పేరొందింది. ఆమె భారత్ తరఫున 232మ్యాచ్‌లు ఆడింది. 50.68సగటుతో 7805పరుగులు చేసింది.