Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik x Rohit: పాపం హార్దిక్.. ఏడ్వలేక నవ్వుతున్నాడు!

హార్దిక్ పాండ్య.. ప్రపంచ స్టార్ ఆల్‌రౌండర్. బ్యాటుతో పాటు బంతితోనూ మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ చేయగలిగే శారీరక సామర్థ్యం, ధోనీ తరహాలో మ్యాచ్‌ను ముగించే నైపుణ్యం అతడి సొంతం. అతడు టీమిండియాలో అడుగుపెట్టిన కొన్నినెలల్లోనే స్టార్ ప్లేయర్‌గా ఎదిగిపోయాడు. భారత్‌కు మరో కపిల్‌దేవ్ దొరికాడని అతన్ని కొనియాడారు. డబ్బు, ఫేమ్‌తో పాటు హార్దిక్ అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

కానీ వరుస గాయాలు హార్దిక్‌ను ఇబ్బందిపెట్టాయి. అయినప్పటికీ తిరిగి కోలుకుని ఎన్నో మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ వదిలిపెట్టడంతో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన అతడు తొలి సీజన్‌లోనే టైటిల్‌ కూడా గెలిచాడు. మరో సీజన్‌లో తృటిలో ట్రోఫీని కోల్పోయాడు. అప్పటి వరకు అతని లైఫ్ సాఫీగా సాగింది.

Hardik s Masked Happiness Unveiling True Emotions

కానీ ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబై ఇండియన్స్‌కు వెళ్లడంతో హార్దిక్ కథ మారిపోయింది. కెప్టెన్సీ కండిషన్‌తో ముంబై ఫ్రాంచైజీకి వచ్చాడని అతని పట్ల రోహిత్ అభిమానుల్లో ద్వేషం రగిలింది. మరోవైపు రీఎంట్రీలో ఫామ్‌ను కోల్పోవడం అతనికి మరో తలనొప్పిగా మారింది. మైదానంలో, బయటా ఏర్పడిన తీవ్ర ఒత్తిడితో హార్దిక్ తన ఆటను కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. బయట పరిస్థితుల కారణంగా హార్దిక్ ఆటపై ప్రభావం పడటం భారత క్రికెట్‌కు కూడా మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హార్దిక్ పాండ్య గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ సంతోషంగా లేడని, బాధను దిగమింగి పైకి నవ్వుతూ నటిస్తున్నాడని పీటర్సన్ అన్నాడు. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా పీటర్సన్ మాట్లాడాడు. ''హార్దిక్ విషయంలో బయట పరిస్థితులు అతడ్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయనిపిస్తోంది. టాస్ సమయంలో అతడు అతిగా నవ్వుతున్నాడు. హ్యాపీగా ఉన్నా అని చెప్పాలనే ఉద్దేశంతో నటిస్తున్నాడు. కానీ అతడు సంతోషంగా లేడు. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను''

''హార్దిక్ బౌలింగ్‌లో ధోనీ సిక్సర్లు సాధించినప్పుడు స్టేడియమంతా దద్దరిల్లింది. హార్దిక్‌పై హేళన పెరిగింది. ఇది అతన్ని చాలా బాధిస్తుంది. అతనికి ఎమోషన్స్ ఉంటాయి. అతను ఓ భారత ప్లేయర్. అతనికి ఇలా జరగకూడదు. ఇది హార్దిక్‌కు మాత్రమే కాదు, అతని ఆటపై ప్రభావం చూపుతుంది. అతని విషయంలో ఏదైనా మంచి జరగాలి'' అని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.

Story first published: Monday, April 15, 2024, 13:57 [IST]
Other articles published on Apr 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+