Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik vs Krunal: అన్న అదుర్స్, తమ్ముడికి టియర్స్(వీడియో)

Hardik vs Krunal: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 222 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ నిర్దేశంచగా.. లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఒక ప్రత్యేకత ఏమిటంటే హార్దిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా ఈ సారి ఆర్సీబీలో భాగంగా ఉన్నాడు. ఈ ఉత్కంఠభరిత పోరు చివరికి పాండ్యా వర్సెస్ పాండ్యాగా మారింది. మ్యాచ్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి 19 పరుగులను డిఫెండ్ చేయడం ద్వారా ముంబై ఆశలను కృనాల్ పాండ్యా దెబ్బతీశాడు. చివరి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి కృనాల్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ ను ప్రదర్శించాడు.

సోమవారం ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య పోరు పాండ్యా బ్రదర్స్ మధ్య బిగ్ ఫైట్ గా మారింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లోనే 42 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు, 4 సిక్సులు బాది తన టీమ్ ను గెలిపించేందుకు హార్దిక్ కష్టపడ్డాడు. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన క్షణం కనిపించింది. అన్న కృనాల్ పాండ్యా వేసిన బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా వరుసగా రెండు బాదాడు. కానీ హార్దిక్ 19వ ఓవర్లో ఔటై పెవిలియన్ కు చేరాడు. ముంబై విజయానికి చివరి ఓవర్ లో 19 పరుగులు అవసరమయ్యాయి. ఓ ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా తన అద్బుత బౌలింగ్ తో 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్సీబీని గెలిపించాడు. చివరకు ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబై ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధపడ్డాడు. పక్కన ఉన్న సహచర ఆటగాడు ఓదార్చుతుంటే దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Hardik vs Krunal Brothers Clash Emotions Overflow Video Goes Viral

చివరి ఓవరి అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని గెలిపించి అన్న కృనాల్ పాండ్యా సంబరాల్లో మునిగిపోగా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయిన హార్దిక్ పాండ్యా డగౌట్ లో కూర్చుని బాధపడ్డాడు. అనంతరం వెంటనే మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సోదరుడు కృనాల్ పాండ్యాను గట్టిగా హగ్ చేసుకున్నాడు. తమ్ముడు హార్దిక్ పాండ్యాను అన్న కృనాల్ ఓదార్చాడు. కాసేపు సోదరులిద్దరూ మైదానంలో కూర్చుని ముచ్చట్లు పెట్టారు.

హార్దిక్ పట్ల భావోద్వేగానికి గురయ్యాను..
మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ గురించి చాలా భావోద్వేగానికి గురయ్యాడు. 'మా సంబంధం చాలా బలంగా ఉంది. మేమిద్దరం మా జట్లు గెలవాలని కోరుకున్నాం. కానీ చివరికి ఒకే జట్టు గెలవగలిగింది. హార్దిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ అతని బాధ నాకు అర్ధమైంది. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆప్యాయత పూర్తిగా సహజమైనది.'అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 8, 2025, 15:23 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+