Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya: బాబర్ వికెట్ తీయగానే ఆనందంతో గంతులేసిన హార్దిక్ ప్రేయసి!.. ఆమె ఎవరో తెలుసా?

Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇండియా బౌలింగ్ అంత ప్రత్యేకంగా లేకపోయినా.. తర్వాత పుంజుకున్నారు. హార్దిక్ పాండ్యా 9వ ఓవర్ ను వేశాడు. ఓవర్ వేయడానికి వచ్చిన వెంటనే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం వికెట్ తీయడం ద్వారా టీమిండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు.

బాబర్ ఆజంను హార్దిక్ ఔట్ చేసిన వెంటనే టీవీ తెరపై అకస్మాత్తుగా ఓ ముఖం కనిపించింది. అది అందరినీ షాక్ కు గురి చేసింది. నిజానికి ఆమె మరెవరో కాదు హార్థిక్ పాండ్యా కొత్త 'లేడీ లవ్' అని చెప్పుకునే జాస్మిన్ వాలియా. భారత్, పాక్ మధ్య జరగుతున్న ఈ మ్యాచ్ చూడడానికి జాస్మిన్ వాలియా దుబాయ్ లోని స్టేడియానికి చేరుకున్నారు.

India vs Pakistan Live స్కోరు కార్డు

Hardik s Rumour Girlfriend Jasmine Walia Celebrates His Babar Azam Wicket Who is She

హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో అమ్మాయితో డేటింగ్ మొదలు పెట్టాడని వార్తలు వచ్చాయి. అనంతరం విదేశీ పర్యటనలకు వెళ్తూ జాస్మిన్ వాలియా ఫోటోలను సోషల్ మీడియాలో హార్దిక్ షేర్ చేయడంతో రిలేషన్ షిప్ గురించి నెటిజన్లు కామెంట్లు చేశారు.

అప్పట్నుంటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ టచ్ లో ఉంటున్నాడని తెలిసింది. బ్రిటీష్ సింగర్ గా, టీవీ స్టార్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన జాస్మిన్ వాలియా.. ఇంగ్లీష్ తో పాటు పంజాబీ, హిందీ భాషల్లో మ్యూజిక్ ఆల్బమ్స్ ను విడుదల చేసింది. జాస్మిన్ వాలియా ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ లో భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించింది. జాస్మిన్ ది ఓన్లీ వే ఈజ్ ఎస్సెక్స్ అనే బ్రిటీష్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయ్యింది.

Story first published: Sunday, February 23, 2025, 17:31 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+