Hardik Pandya: భారత క్రికెటర్ల సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లో సక్సెస్ అయిన ఆటగాళ్ల సంపాదన అయితే అంతకుమింది ఉంటుంది. వాళ్లంతా అత్యంత లగ్జరీ లైఫ్ స్టైల్‌తో జీవనం కొనసాగిస్తుంటారు. అలా టీమిండియా స్టార్ క్రికెటర్లలో స్టైల్ అండ్ ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వారిలో హార్దిక్ పాండ్య ఒకడు. టాప్ టు బాటమ్.. ధరించే డ్రెస్, కళ్లజోడు, వాచ్ నుంచి షూస్ వరకు అన్నీ లగ్జరీ బ్రాండ్ వాటినే ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంటాడు. ఈ సారి కూడా హార్దిక్ పాండ్యా తన కొత్త హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్‌తో దుబాయ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు.
దాని విలువ అన్ని కోట్లా?
అయితే తాజాగా ఆసియా కప్ 2025 ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ ధరించిన వాచ్ ధర సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది. ఇప్పుడు ఆ వాచ్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్లో అందరి కళ్లు దానిపైనే పడ్డాయి. ఎందుకంటే అతడు రిచర్డ్ మిల్లె RM27-04 రఫెల్ నాదల్ టూర్బిల్లాన్ వాచ్ ధరించాడు. ఇండియన్ హోరోలజీ ప్రకారం.. హార్దిక్ వాచ్ ధర రూ. 20 కోట్లు అని అంచనా. ఈ వాచ్ ధర ఆసియా కప్ విజేత జట్టుకు లభించే మొత్తం బహుమతి డబ్బు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టుకు కేవలం రూ.2.6 కోట్లు మాత్రమే లభిస్తాయి. అందుకే ప్రస్తుతం ఈ వాచ్ ధర నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

రిచర్డ్ మిల్లే RM 27-04 వాచ్ ప్రత్యేకతలు
ఈ వాచ్ సాధారణమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 యూనిట్లు మాత్రమే తయారు చేయబడిన ప్రత్యేక ఎడిషన్. స్పెయిన్ టెన్నిస్ దిగ్గం రఫేల్ నాదల్ కోసం ప్రత్యేకంగా ఈ వాచ్‌ను రూపొందించారు. ఈ వాచ్ ప్రధాన లక్షణ తేలికైన బరువు, అసాధారణమైన మన్నిక. ఈ వాచ్ కేవలం 30 గ్రాములు బరువు ఉంటుంది. ఇది క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ వాచ్ 12,000 G ఫోర్స్ కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు. ఇది ప్రపంచ రికార్డు. ఆటగాళ్లు మైదానంలో పడే ఒత్తిడికి కూడా ఇది తట్టుకునేలా రూపొందించబడింది.
హార్దిక్ పాండ్యా కేవలం తన ఆటతోనే కాకుండా.. తన విలాసవంతమైన వస్తువుల వల్ల కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇంత ఖరీదైన వాచ్‌తో హార్దిక్ ప్రాక్టీస్ చేయడం అభిమానుల్లో, క్రీడా నిపుణుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వాచ్ హార్దిక్ పాండ్యా హైఫై జీవనశైలికి ఒక నిదర్శనంగా నిలిచింది.