Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. సెర్బియాకు చెందిన తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకుల తర్వాత మోడల్ జాస్మిన్ వాలియాతో కూడా హార్దిక్ పాండ్యాకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా హార్దిక్ జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. ఈ సారి కూడా హార్దిక్ మనసు దోచుకున్నది ఒక మోడలే కావడం విశేషం. అవును, క్రికెట్ మైదానంలో సిక్సర్లు బాగే హార్దిక్, ప్రేమ మైదానంలో కూడా కొత్త షాట్లు ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. మరి ఆలస్యం ఎందుకు? ఈసారి హార్దిక్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆ కొత్త మోడల్‌ను పరిచయం చేసుకుందాం.
కొత్త గర్ల్‌ఫ్రెండ్ పేరు మహియెకా శర్మ
మహియెకా శర్మ ఒక వర్థమాన మోడల్, నటి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమెకు 41 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె పేరు హార్దిక్‌తో కలవడంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య రాకెట్ వేగంతో పెరగడం ఖాయం. మహియెకా శర్మ చాలా ఆత్మవిశ్వాసం వృత్తినైపుణ్యం కలిగిన మోడల్. ఆమెను 'బ్యూటీ విత్ బ్రెయిన్' (అందం, తెలివితేటల కలయిక) అని చెప్పవచ్చు. 10వ తరగతిలో 10 సీజీపీఏ సాధించిన ఆమె, ఆ తర్వాత ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఆమె డాక్టర్ లేదా ఇంజనీర్ అవుతుందని భావించారు. కానీ మహికా లక్ష్యం మాత్రం మోడలింగ్, నటన. ఆమె గుజరాత్, ఢిల్లీలలో స్థానిక పోటీలతో తన కెరీర్‌ను ప్రారంభించి, సోషల్ మీడియాలో తన ప్రొఫైల్‌ను పటిష్టం చేసుకుంది.

ఫిట్‌నెస్ అంటే మహియెకాకు చాలా ఇష్టం
మోడలింగ్‌తో పాటు, మహియెకాకు ఫిట్‌నెస్ అంటే కూడా చాలా ఇష్టం. కాలేజీ పూర్తైన వెంటనే ఆమె యోగాలో వృత్తిపరమైన కోచింగ్ తీసుకుంది. ఆమె సూపర్ ఫిట్ బాడీ దీనికి నిదర్శనం. ఆమె అనేక టాప్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేసింది, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అంతేకాకుండా, ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో 'మోడల్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.
ఎలా పుకార్లు మొదలయ్యాయి?
ఈ పుకార్లన్నీ ఒక వీడియో రెడ్డిట్‌లో వైరల్ అయినప్పటి నుంచి మొదలయ్యాయి. ఆ వీడియోలో ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వ్యక్తి మసక మసకగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన పోస్టులో జెర్సీ నెంబర్ 33 గురించి ప్రస్తావన వచ్చింది. ఇది హార్దిక్ పాండ్యాకు సంబంధించింది. దీంతో ఆన్‌లైన్లో కొత్త టోర్నమెంట్, కొత్త గర్ల్ ఫ్రెండ్ వంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇది వారి వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని పెంచింది.
సోషల్ మీడియాలో పుకార్లకు ఊతం
హార్దిక్ పాండ్యా, మహియెకా శర్మ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు గుర్తించిన తర్వాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత హార్గిక్ పాండ్యా ధరించే రోబ్ గౌన్‌తో మహియెకా కనిపించిన ఒక చిత్రం కూడా వైరల్ అయింది. ఈ అన్ని విషయాల ఆధారంగా హార్దిక్, మహియెకా శర్మ డేటింగ్ వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే మహియెకా క్రికెట్‌కు సంబంధించిన చాలా రీల్స్‌ను లైక్ చేశారు. వాటిలో హార్దిక్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. అందుకే ఇది కేవలం స్నేహం కూడా కావచ్చని కూడా కొందరు అంటున్నారు.
హార్దిక్ పాండ్యా, మహియెకా శర్మ రిలేషన్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతకు ముుందు హార్దిక్ పేరు బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో ముడిపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరు తరచుగా కలిసి కనిపించేవారు. జాస్మిన్ కూడా హార్దిక్ మ్యాచ్‌లలో అతడిని ప్రోత్సహించడానికి వెళ్లేవారు. ఇప్పుడు అభిమానులు ఈ విషయంపై ఏదైనా అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.