For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ కొంపముంచింది?

GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన ఆ జట్టు.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై పరాజయం పాలైంది. శనివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61) మరోసారి రాణించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు.

Hardik Pandya s disappointing batting performance against Gujarat Titans in IPL 2025

హార్దిక్ జిడ్డు బ్యాటింగ్
అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ కేవలం 160 పరుగులకే పరిమితం అయ్యింది. స్టార్ ప్లేయర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్(48), తిలక్ వర్మ(39) పరవాలేదనిపించారు. సూర్యకుమార్ కాస్త పోరాడినా.. అతడికి సహచరుల నుంచి తగినంత మద్దతు లభించలేదు. తిలక్ వర్మ 36 బంతుల్లో 39 పరుగులు చేసినా అవసరమైన రన్ రేట్ ను కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో వచ్చిన ా ఆశించిన ప్రభావం చూపలేదు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా జిడ్డూ బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలర్ గా రెండు వికెట్లు.. కెప్టెన్ గా పర్వాలేదనిపించిన అతడు.. బ్యాటర్ గా మాత్రం చేతులెత్తేశాడు. ఏదో టెస్టులకు ప్రిపేర్ అయినట్లు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడాడు. అయితే బ్యాటర్ గా మాత్రం దారణంగా విఫలమయ్యాడు.

ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిన ముంబై ఇండియన్స్ ఇంకా పాయింట్ల ఖాతాను తెరవలేదు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను మార్చి 31న(సోమవారం) ఆడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్ లో అయినా ముంబై బోణీ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Story first published: Sunday, March 30, 2025, 12:09 [IST]
Other articles published on Mar 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+