Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలానికి పాండ్యా: 10 కోట్లు చెల్లించేందుకు ప్రాంచైజీలు రెడీ!

హైదరాబాద్: భారత క్రికెట్లో యువ ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న హార్ధిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. 2018లో నిర్వహించే ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు పాండ్యా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అట్టిపెట్టుకోవాలని చూస్తున్న ముంబై ఫ్రాంజైజీ

అట్టిపెట్టుకోవాలని చూస్తున్న ముంబై ఫ్రాంజైజీ

ముంబై ప్రాంఛైజీ హార్దిక్ పాండ్యాని అట్టిపెట్టుకోవాలని చూస్తున్నా.. పాండ్యా మాత్రం వేలంలో పాల్గొనేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పాండ్యా ఇప్పటికే బీసీసీఐకి వెల్లడించాడు. కాగా, 2018 ఏప్రిల్‌ 4న ఐపీఎల్‌-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

2013లో రూ.10లక్షలకు కొనుగోలు చేసిన ముంబై

2013లో రూ.10లక్షలకు కొనుగోలు చేసిన ముంబై

ఇందులో భాగంగా ఫిబ్రవరిలో బెంగళూరులో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది. 2013లో పాండ్యాను ముంబై రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల తర్వాత అతడి ఫీజును 20 లక్షలకు పెంచింది. ఇందుచేతనే పాండ్యా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాడు. మరోవైపు పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాకు ముంబై జట్టు రూ.2 కోట్లు చెల్లిస్తోంది.

భారత విజయాల్లో కీలకపాత్ర

భారత విజయాల్లో కీలకపాత్ర

ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్యా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై సిక్సర్ల వర్షం కురిపించాడు. అరంగేట్రం టెస్టులో కూడా తనదైన శైలిలో రాణించాడు. అనంతరం ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

రూ.10 కోట్లు చెల్లించేందుకు ప్రాంఛైజీలు సిద్ధం

రూ.10 కోట్లు చెల్లించేందుకు ప్రాంఛైజీలు సిద్ధం

దీంతో పాండ్యాను క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో పోల్చుతున్నారు. కెప్టెన్ కోహ్లీ అయితే భారత్‌కు లభించిన బెన్‌ స్టోక్స్‌ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా ఐపీఎల్ వేలానికి వస్తే కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు పాండ్యాను ఖరీదు చేసేందుకు ఆసక్తిగా చూపుతున్నట్లు తెలిసింది. పాండ్యా వేలంలోకి వస్తే దాదాపు రూ.10 కోట్లకు పైగా చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+