గాయం కారణంగా టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వేగంగా కోలుకుంటున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడని తెలుస్తోంది. అంతేగాక వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సమాచారం. ఇటీవల ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబయి గూటికి చేరిన హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందించారు.
అయితే జనవరిలో ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక టీమిండియాను హార్దిక్ నడిపించనున్నట్లు సమాచారం. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ అఫ్గానిస్థాన్‌తోనే.

మరోవైపు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో సూర్యకు గాయమైన సంగతి తెలిసిందే. అయితే హార్దిక్ అందుబాటులో లేకపోతే అఫ్గానిస్థాన్ సిరీస్‌కు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించనుంది. గాయంతో సూర్య మైదానాన్ని వీడినప్పుడు జట్టును నడిపించిన రవీంద్ర జడేజాను కూడా కెప్టెన్‌గా బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉంది.
"సూర్య తన చీలమండ గాయం నుండి కోలుకోవడానికి సుమారు ఆరు నుంచి ఏడు వారాల సమయం పడుతుంది. సూర్య గ్రేడ్ 2 గాయం తీవ్రతతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే వారం బెంగళూరులోని NCAకి వెళ్లనున్నాడు. ఇక హార్దిక్ విషయానికొస్తే.. అతడు ఫిట్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌కు హార్దిక్ దూరమవుతున్నాడనే కథనాలన్నీ వదంతులే. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది.కాబట్టి ఈ సమయంలో ఏదైనా కేవలం ఊహాగానాలు మాత్రమే" బీసీసీఐ వర్గాలు తెలిపాయి.