అమ్మాయిల మోజులో పడ్డాడా?: పాండ్యా తండ్రి ఏమన్నాడో తెలుసా?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నాయికలకు, టీమిండియా క్రికెటర్లకు ఏదో తెలియని బంధం కొనసాగుతూనే ఉంది. తాజాగా, భారత యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కూడా ఆ జాబితాలో చేరారు. సోషల్ మీడియాలో బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా, మోడల్ శివానీ దండేకర్లు.. పాండ్యాతో సంభాషణ జరిపారు.

పరిణీతి, దండేకర్లతో..?
ఈ క్రమంలో పరిణీతి చోప్రాతో పాండ్య డేటింగ్‌లో ఉన్నాడని ప్రచారం కూడా సాగింది. మోడల్ శివాని దండేకర్‌తోనూ అతడు చనువుగా ఉంటున్నాడనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా దృష్టి క్రికెట్ నుంచి అమ్మాయిలపైకి మళ్లిందంటూ పలువురు సామాజిక మధ్యమాల్లో విమర్శిస్తున్నారు.

తండ్రీ, కొడుకుల వివరణ..
కాగా, అలాంటిదేమీ లేదని శ్రీలంక పర్యటన నుంచి వచ్చిన పాండ్య వివరణ కూడా ఇచ్చాడు. హార్దిక్‌పై చక్కెర్లు కొడుతున్న ఈ వార్తలపై తాజాగా ఆయన తండ్రి హిమాన్షు పాండ్యా కూడా స్పందించారు.

మా వాడిపైనే ఎందుకో..
‘హార్దిక్ పాండ్యపై అమ్మాయిలకు ఆసక్తి ఎందుకు కలుగుతోందో నాకు అర్థం కావడంలేదు(నవ్వుతూ). ఒకవేళ అతగాడి ఆటతీరు, భారత జట్టులో స్థానం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు. ఇదేమీ పెద్ద సమస్య కాదు' అని చెప్పారు.

అంతా క్రికెట్‌పైనే...
అంతేగాక, ‘ప్రతి క్రికెటర్‌కు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అతను చాలా దృఢంగా ఉంటాడు. అమ్మాయిల కారణంగా వల్ల క్రికెట్‌పై అతని ఫోకస్ ఏమాత్రం తగ్గదు. అతడి దృష్టంతా క్రికెట్ పైనే. ఇటీవలే వన్డేలో మూడు వరుస సిక్స్‌లు బాదాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు ఎప్పుడు కొడతాడా? అని ఎదురుచూస్తున్నాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు' అని హిమాన్షు చెప్పుకు రావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications