ధోనీ క్వాలిటీస్ డిటో బై డిటు
ధోనీలోని కాన్ఫిడెన్స్ ప్రత్యర్థి బౌలర్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. ధోనీలోని కూల్ నెస్.. ప్రత్యర్థి కెప్టెన్‌ను హీటెక్కిస్తుంది.. ధోనీ షాట్ సెలెక్షన్ ఫీల్డర్లకు అంతుచిక్కదు.. ధోనీ రనప్ లక్ష్యాన్ని కొద్దికొద్దీగా కరగదీస్తుంది.. ధోనీ మెంటాలిటీ ఆటోమేటిక్‌గా మ్యాచ్‌పై పైచేయి సాధించేలా చేస్తుంది. ధోనీలో ఉన్న ఇలాంటి అన్నీ క్వాలిటీస్ ప్రస్తుతం హార్దిక్ పాండ్యాలో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి.
కీలక మ్యాచ్‌ల్లో ధోనీ పోషించే పాత్రను హార్దిక్ ప్రస్తుతం అదేరీతిలో పోషిస్తున్నాడు. ఐపీఎల్ 2022 ఫైనల్లో హార్దిక్ బౌలింగ్లో, బ్యాటింగ్లో అదరగొట్టి మ్యాచ్ గెలిపించాడు. మొన్నటికి మొన్న డిసైడర్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో మెరిసి మ్యాచ్ గెలిపించడమే కాకుండా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తాజాగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ లాంటి ఉద్వేగభరితమైన మ్యాచ్‌లో కూడా తానేంటో చూపించాడు.
అచ్చు ధోనీ లాగే..
కొన్నాళ్లుగా భారత్ సరైన ఫినిషర్ల కోసం అన్వేషిస్తూనే ఉంది. మ్యాచ్‌లో టాపార్డర్ ఆడితేనే గెలిచే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు టాపార్డర్ విఫలమైనా.. లేదా చివర్లో ఔటయినా ఇండియా గెలుపు గీత దాటడం చాలా కష్టమయ్యేది. ధోనీ జట్టులో ఉన్నప్పుడు ధోనీ ఉన్నాడన్న ధీమా ఉండేది. అయితే ఆల్ ఆఫ్ సడెన్ ధోనీ రిటైర్మెంట్ ఇచ్చాక ఆ స్థానాన్ని సమీప భవిష్యత్తులో మోయగల ప్లేయర్ మాత్రం వెలుగులోకి రాలేదు.
అయితే ఇటీవల పలు ఇన్నింగ్స్‌ల ద్వారా హార్దిక్ పాండ్యా అద్భుత ఫినిషింగ్ స్కిల్స్‌తో ధోనీని మరిపిస్తున్నాడు. ఇప్పటిదాకా ఓ లెక్క ఇక నుంచి ఓ లెక్క అనేలా తాజా మ్యాచ్ ద్వారా ధోనీ లేని లోటును హార్దిక్ పాండ్యా స్పష్టంగా పూడ్చేసినట్లు అనిపించింది. డీకే ఉన్నా.. అతని వయసు 37 కాబట్టి ఒకట్రెండు సంవత్సరాలకు మించి జట్టులో ఉండడు. అందువల్ల హార్దికే జట్టు ఫినిషర్‌గా ఇక ముందు కీలకం కానున్నాడు.
మహీ భాయ్ నుంచే నేర్చుకున్నానంటూ
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో బరిలోకి దిగడం, మిడిలార్డర్లో కీలక వికెట్లు పడగొట్టడం, మెరుపు లాంటి ఫీల్డింగ్ అన్నీ అచ్చు ధోనీని తలపిస్తున్నాయి. గతంలో చాలా అగ్రెసివ్ పర్సన్‌లా ఉండే హార్దిక్ ప్రస్తుతం కూల్‌గా వ్యవహరిస్తూ ధోనీని డిటో బై డిటో దించుతున్నాడు. ఇక ఒకానొక సందర్భంలో హార్దిక్ సైతం మహీ భాయ్ నుంచి ఒక ఫినిషర్‌లాగా మ్యాచ్‌లు ఎలా ఫినిష్ చేయాలో నేర్చుకున్నాను అంటూ పేర్కొన్నాడు.
వారసుడు వచ్చేశాడు అంటూ..
ఇక పాకిస్తాన్‌పై తన చక్కటి ప్రదర్శన తర్వాత హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ డబుల్ అయ్యారు. చాలా మంది నెట్టింటా హర్దిక్ పాండ్యా మారిపోయాడురా అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ధోనీ లేని లోటు తీరిపోయిందిరా అంటూ క్యాప్షన్లు ఇస్తున్నారు. ఇంకొందరు ధోనీకి సరైన వారసుడు వచ్చాడురా అంటూ పేర్కొంటున్నారు. 28ఏళ్ల హార్దిక్ పాండ్యా మరో 8 నుంచి 10ఏళ్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించగలడు. అన్నీ అనుకున్నట్లే జరిగితే రోహిత్ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ కెప్టెన్‌గా రాహుల్, పంత్ కాకుండా హార్దిక్ పాండ్యా అయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












