Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Final: భావోద్వేగాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా భార్య నటాషా..

Hardik Pandya wife Natasa Stankovic emotionally embraces Hardik Pandya after victory in final

ఐపీఎల్ 2022 సీజన్‌ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లకు 130పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు.

గుజరాత్ బౌలర్లలో హార్దిక్ మూడు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించడంతో గుజరాత్ విజయదుందుభీ మోగించింది.

భర్త పడ్డ పాట్లు గుర్తుతెచ్చుకుని

కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు నాయకుడిగా తన మొదటి సీజన్‌లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ అతనిని కలవడానికి వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇరువురు భావోద్వేగంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కాసేపు హార్దిక్‌ను గట్టిగా పట్టుకుని కాస్త వెక్కి వెక్కి ఏడ్చింది.

ఇక నటాషా కళ్లల్లో నుంచి నీళ్లు రావడంతో హార్దిక్ ఆమెను ఓదార్చాడు. హార్దిక్ కూడా కాస్త ఎమోషనల్ కావడంతో ఆమె హార్దిక్‌ను ఓదార్చింది. తన భర్త విజయం కోసం పడ్డ పాట్లు ఆమెను ఇలా భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయి. ఇక గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ల కోసం నటాషా గ్రౌండ్లోకి వచ్చి మరీ ఎంతో సపోర్ట్ చేసేది.

విమర్శకులకు బుద్ధి చెప్పేలా..

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ బౌలింగ్‌ చేయనందుకు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి అతను ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సంవత్సరం ఐపీఎల్లోనే మళ్లీ ఆట మొదలెట్టాడు. ఇన్ని రోజులు అతను తన ఫిట్‌నెస్‌పై చాలా కృషి చేశాడు. ఇక ఈ టోర్నీ ఆద్యంతం కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అద్భుతంగా రాణించాడు.

ఫైనల్‌లో అద్భుత బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంలో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా తను ఎంత విలువైన ప్లేయరో చాటి చెప్పాడు. తన మీద విమర్శలు చేసిన వారికి బుద్ధి చెప్పేలా అతను రాణించాడు

కీలక భాగస్వామ్యం నెలకొల్పి..

కీలక భాగస్వామ్యం నెలకొల్పి..

131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహా(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మాథ్యూవేడ్‌ను బౌల్ట్ క్యాచ్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా గిల్‌తో కలిసి ఎంతో జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. 63పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు.

ఈ సీజన్లో అత్యుత్తమంగా ఆడిన హార్దిక్

ఈ సీజన్లో అత్యుత్తమంగా ఆడిన హార్దిక్

హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో అతను 487 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో టైటాన్స్ తరఫున అత్యధికంగా 15మ్యాచ్‌లలో 131.26 స్ట్రైక్ రేట్, 44కంటే ఎక్కువ సగటు మెయింటెన్ చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. హార్దిక్ టోర్నీలో అతను బౌల్ చేసిన 10ఇన్నింగ్స్‌లలో 8వికెట్లు తీశారు. ఫైనల్‌లో 3/17 అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయానికి బాటలు వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17పరుగులు మాత్రమే ఇచ్చి బట్లర్, శాంసన్, హెట్ మయర్ లాంటి విధ్వంస ప్లేయర్లను ఔట్ చేశాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుపొందాడు.

Story first published: Monday, May 30, 2022, 10:15 [IST]
Other articles published on May 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+