For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాట్‌టాపిక్‌గా హార్దిక్ వాచ్ ధర.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీతో సమానంగా..

భారత క్రికెటర్ల సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ లో సక్సెస్ అయిన ప్లేయర్ల సంపాదన అయితే అంతకుమింది ఉంటుంది. వాళ్లంతా అత్యంత లగ్జరీ లైఫ్ ‌స్టైల్ తో జీవనం కొనసాగిస్తుంటారు. అలా టీమిండియా స్టార్ క్రికెటర్లలో స్టైల్ అండ్ ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వారిలో హార్దిక్ పాండ్య ఒకడు. టాప్ టు బాటమ్.. ధరించే డ్రెస్, కళ్లజోడు, వాచ్ నుంచి షూస్ వరకు అన్నీ లగ్జరీ బ్రాండ్ వాటినే ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంటాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీతో..
అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ ధరించిన వాచ్ ధర సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది. ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్‌మనీతో సమానంగా ఉంటుందని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ తో పాటు అతడి చేతి మణికట్టుకు ఉన్న వాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్ అభిమానుల అందరి కళ్లు దానిపైనే పడ్డాయి. ఎందుకంటే అతడు రిచర్డ్ మిల్లె RM27-04 రఫెల్ నాదల్ టూర్బిల్లాన్ వాచ్ ధరించాడు. ఇండియన్ హోరోలజీ ప్రకారం.. హార్దిక్ వాచ్ రిటైల్ ప్రైజ్ రూ.9.15 కోట్లు. కానీ ఇప్పుడు దాని విలువ రూ.18-21 కోట్లు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచిన భారత జట్టుకు రూ.20 కోట్లు అందించారని సమాచారం. అంటే ప్రైజ్‌మనీతో సమానంగా హార్దిక్ పాండ్య వాచ్ ధర ఉంది. అందుకే ప్రస్తుతం ఈ వాచ్ ధర నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

బ్యాటుతోనూ, బంతితోనూ..
ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఛాంపియన్స్‌ ట్రోఫీలో అటు బ్యాటుతోనూ ఇటు బంతితోనూ కీలకంగా వ్యవహరించాడు. ఐదు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో అద్భుతంగా ఫినిషర్‌ పాత్ర పోషించాడు.

Hardik Pandya watch price more than Champions trophy 2025 Teamindia prize money
Photo Credit: MYKHEL
Story first published: Wednesday, March 12, 2025, 12:54 [IST]
Other articles published on Mar 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+