న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా vs పాండ్యా: తలకు తగిలేలా బంతిని బాదాడు (వీడియో)

Pandya VS Pandya : Hardik Almost Knocks Krunal's Head Off In A Practice Session || Oneindia Telugu
Hardik Pandya trolls Krunal by sharing a video of training session, elder brother comes up with an epic reply - Watch

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్‌ కోసం పాండ్యా సోదరులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న తొలి టీ20లో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరిస్ కోసం పాండ్యా సోదరులు హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా కఠినంగా శ్రమించారు.

<strong>యాషెస్‌ ఆఖరి టెస్ట్‌: 18 ఏళ్ల తర్వాత సిరీస్ నెగ్గాలని ఆసీస్.. ఒత్తిడిలో ఇంగ్లండ్‌</strong>యాషెస్‌ ఆఖరి టెస్ట్‌: 18 ఏళ్ల తర్వాత సిరీస్ నెగ్గాలని ఆసీస్.. ఒత్తిడిలో ఇంగ్లండ్‌

భారత పర్యటనలో భాగంగా

భారత పర్యటనలో భాగంగా

భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. విండిస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా సఫారీలతో టీ20 సిరిస్‌కు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవలే నెట్స్‌లో హెలికాప్టర్ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.

కృనాల్‌ పాండ్యా తలకు తగిలేలా

కృనాల్‌ పాండ్యా తలకు తగిలేలా

అయితే, సోదరుడు కృనాల్‌ పాండ్యా బంతులు విసరగా హార్దిక్‌ పాండ్యా భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో ఓ బంతిని దాదాపుగా కృనాల్‌ పాండ్యా తలకు తగిలేలా హార్దిక్ పాండ్యా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్ పాండ్యా ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ప్రాక్టీస్‌లో పాండ్యా వర్సెస్‌ పాండ్యా

"ప్రాక్టీస్‌లో పాండ్యా వర్సెస్‌ పాండ్యా. నేను ఈ రౌండ్‌ గెలిచాననే అనుకుంటున్నాను పెద్దన్నా. దాదాపు నీ తలకు తగిలేలా బంతి ఆడినందుకు సారీ"అంటూ హార్దిక్ పాండ్యా ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

తమ్ముడు పోస్టు చేసిన వీడియోపై

అయితే తమ్ముడు పోస్టు చేసిన వీడియోపై కృనాల్ పాండ్యా స్పందించాడు. "హహహా.. కూల్‌ బ్రో. కానీ నువ్వెందుకు ఈ వీడియో అప్‌లోడ్‌ చేయలేదు?" అని మరో వీడియోని పోస్టు చేసాడు. అందులో బంతిని ఆడలేక కృనాల్ పాండ్యా క్రీజులో తడబడ్డాడు. దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్‌ 15న తొలి టీ20 ప్రారంభం కానుంది.

Story first published: Thursday, September 12, 2019, 10:48 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X