T20 World Cup 2022: మూడు వికెట్లతో సత్తా చాటిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్ బోర్న్ లో ఇండియా, పాకిస్థాన్ కు మధ్య సూపర్ 12 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్ల వేసిన హార్దిక్ పాండ్యా 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్ వికెట్లు తీశాడు. షాదాబ్ ఖాన్ 5 పరుగులు చేయగా.. హైదర్ అలీ 2, మహ్మద్ నవాజ్ 9 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
భారత్ కు హర్ష్ దీప్ బోణి చేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజాం హర్ష్ దీప్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ హర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ భారత్ బౌర్లను ఎదుర్కొని అలవోకగా పరుగులు చేశాడు. అయితే ఇఫ్తికార్ అహ్మద్ ఔటవడంతో పాక్ పతనం మొదలైంది.ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగులతో టాప్ స్కోర్ గా ఉన్నాడు.
మరో బౌలర్ హర్ష్ దీప్ కూడా మూడు వికెట్లు తీశాడు. తన మొదటి ఓవర్ లోనే పాక్ కెప్టెన్ బాబర్ అజాంను ఔట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ రిజ్వాన్ కూడా హర్ష్ దీపే పెవిలియన్ చేర్చాడు. మరో స్పెల్ లో అసిఫ్ అలీని ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ ఒక వికెట్ తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications