Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్‌సీఏకు హార్దిక్‌ పాండ్యా.. ద్రవిడ్‌ పర్యవేక్షణలో రెండు వారాలు శిక్షణ.. వన్డేలకు దూరం!!

Hardik Pandya To Train Under Rahul Dravid’s Team, Likely To Miss New Zealand ODIs

ముంబై: వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లనున్నాడు. హార్దిక్‌ మంగళవారం బెంగళూరుకు చేరుకోనున్నాడు. ఎన్‌సీఏ చీఫ్, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌, అతడి బృందం పర్యవేక్షణలో హార్దిక్‌ శిక్షణ పొందనున్నాడు. దాదాపు రెండు వారాల పాటు అతడు ఎన్‌సీఏలోనే ఉండి శిక్షణ పొందుతాడు.

ముంబైలో పరీక్షలు:

ముంబైలో పరీక్షలు:

జనవరి 14న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు నెట్స్‌లో హార్దిక్‌ బంతులు విసిరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు హార్దిక్‌ బంతులను ఎదుర్కొన్నారు. కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఆధ్వర్యంలో సాధన చేసి చెమటోడ్చాడు. ఈ సమయంలో హార్దిక్‌ను పరీక్షించిన టీమిండియా జట్టు యాజమాన్యం దాదాపు రెండు వారాలు ఎన్‌సీఏ వెళ్లాలని సూచించింది.

 ఎన్‌సీఏలో రెండు వారాలు:

ఎన్‌సీఏలో రెండు వారాలు:

'ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు హార్దిక్‌ పాండ్య బంతులు వేసాడు. కోచ్ రవిశాస్త్రి, భరత్‌ అరుణ్‌, వైద్య బృందం పరీక్షించింది. హార్దిక్‌ను బెంగళూరులోని ఎన్‌సీఏ వెళ్లాలని జట్టు యాజమాన్యం సూచించింది. మంగళవారం నుంచి అతడికి శిక్షణ ప్రారంభం అవుతుంది. దాదాపు రెండు వారాలు అతడు ఎన్‌సీఏలో ఉంటాడు. ఆ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తాడు' అని బీసీసీఐకి చెందిన వర్గాలు తెలిపాయి.

 ముందుగానే కోలుకున్న హార్దిక్‌:

ముందుగానే కోలుకున్న హార్దిక్‌:

తొలి వన్డేకి ముందు ముంబైలో హార్దిక్‌ను టీమిండియా కోచింగ్బృందం పరీక్షించింది. బౌలింగ్‌ పరీక్షలో (యోయో టెస్టు) అతడు విఫలమయ్యాడు. అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత్‌-ఏ జట్టుకు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికచేయలేదు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఎన్‌సీఏ పంపించనున్నారు. వెన్నెముక దిగువ భాగంలో శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌.. అనుకున్న సమయం కన్నా ముందుగానే కోలుకున్నాడు.

 జట్ల ఎంపిక తాత్కాలికంగా వాయిదా:

జట్ల ఎంపిక తాత్కాలికంగా వాయిదా:

త్వరలో ప్రారంభమయ్యే ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటి జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ ప్రకటించింది. న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆరోజే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగే వన్డేలకు హార్దిక్ దూరం కానున్నాడు.

Story first published: Tuesday, January 21, 2020, 9:30 [IST]
Other articles published on Jan 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+