హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ ఫిక్స్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తన ప్రియురాలు మహీకా శర్మతో హార్దిక్ పాండ్యా ఏడడుగులు వేయబోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమాయణంలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. తాజా సమాచారం ప్రకారం మే 22న ఓ ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరగనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ సాగుతుండగానే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త బయటకు రావడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హార్దిక్ పాండ్యాకు ఇది రెండో వివాహం. గతంలో మోడల్ నటాష్ స్టాంకోవిచ్‌తో మే 31, 2020న లాక్‌డౌన్ సమయంలో హార్దిక్ పాండ్యాకు మొదటి పెళ్లి జరిగింది. వీరికి అగస్త్య పాండ్యా అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తర్వాత అంటే జులై 2024లో హార్దిక్-నటాషా దంపతులు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ పేరు పలువురితో వినిపించినప్పటికీ.. ఇప్పుడు ఫైనల్‌గా మహికా శర్మతో హార్దిక్ పాండ్యా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఈ సీజన్ అస్సలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం గాయం కారణంగా హార్దిక్ పాండ్యా గత రెండు మ్యాచ్‌ల్లో మైదానంలోకి దిగలేదు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగే తదుపరి మ్యాచ్ సమయానికి హార్దిక్ పాండ్యా కోలుకుని బరిలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఎల్ 2025లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. వరుసగా రెండు సీజన్లలోనూ జట్టును సరైన దారిలో నడపలేకపోయాడు. అతని కెప్టెన్సీలో ముంబై ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగింది.
నిజానికి ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ సీజన్లో ముంబై ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై తన చివరి మ్యాచ్‌లు ఆడనుంది. కెప్టెన్‌గా విఫలం కావడమే కాకుండా జట్టు కూడా వెనుకంజలో ఉండటంతో ఈ సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచే కాకుండా, అసలు జట్టు నుంచే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications