సీఎస్కే జట్టులోకి హార్దిక్ పాండ్యా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన ఘోరంగా నిరాశపరిచింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్ లీగ్ దశలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ముంబై జట్టు ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా ఈ సీజన్ ఓ పీడకలలా సాగింది. ఒకవైపు గాయాలు మరోవైపు పేలవమైన ఫామ్‌తో హార్దిక్ పాండ్యా తీవ్రంగా సతమతమయ్యాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్‌ను ముంబై జట్టు ట్రేడింగ్ ద్వారా వేరే జట్టుకు పంపించబోతోందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది.
హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పంచుకున్నాడు. ఆ ఫోటోలో ఒక లాప్‌టాప్, ఒక నోట్‌బుక్, ఒక పెన్ , హార్దిక్ మొబైల్ ఫోన్ ఉన్నాయి. అయితే ఈ ఫోటోలో క్రికెట్ అభిమానుల కళ్లు నేరుగా హార్దిక్ మొబైల్ స్క్రీన్‌పై పడ్డాయి. ఆ ఫోన్ డిస్‌ప్లేపై సమయం "07:07" అని చూపిస్తోంది. ఈ నంబర్‌ను చూడటమే ఆలస్యం.. సోషల్ మీడియా యూజర్లు దీనికి టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీతో లింక్ పెట్టడం ప్రారంభించారు.

క్రికెట్ ప్రపంచంలో '7' అనే నంబర్ ధోనీ జెర్సీ నంబర్‌గా ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా 7 నంబర్ అనగానే 'తలా ఫర్ ఏ రీజన్(Thala For A Reason)" ట్రెండ్ ఎంతలా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు హార్దిక్ ఫోన్‌లో సరిగ్గా 7 గంటల 7 నిమిషాలు ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేయడంతో.. ఇదంతా ధోనీ కోసమేనని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పైగా వచ్చే సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబైని వీడి, ధోనీ మెంటార్‌గా ఉన్న సీఎస్కే(చెన్నై సూపర్ కింగ్స్) జట్టులోకి మారబోతున్నాడనే హింట్ ఇవ్వడానికే ఈ పోస్ట్ పెట్టాడంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ చర్చలపై హార్దిక్ కానీ, ముంబై యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఈ సీజన్ వైఫల్యంపై స్పందిస్తూ.. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. "ప్రస్తుతం జట్టు ప్రదర్శనపై పోస్టుమార్టమ్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది భావోద్వేగాలతో కూడుకున్నది అవుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో ప్రశాంతంగా కూర్చుని ఆలోచించడానికి ప్రతి ఒక్కరికీ కొంత సమయం, స్పేస్ కావాలి. అప్పుడే మేనేజ్మెంట్ పరంగా సరైన నిర్ణయాలు తీసుకోగలం. అంతేకానీ ఇప్పుడే హడావిడిగా హార్దిక్ భవిష్యత్తు గురించి మాట్లాడటం బాధ్యతారాహిత్యం అవుతుంది" అని కీరన్ పొలార్డ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications