Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా: మౌనం వీడిన ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై భారీగా చర్చలు జరుగుతున్నాయి. హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయమై ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కూడా ఈ భారత ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి ట్రేడ్ చర్చలు జరగడం లేదని ఆ ఫ్రాంచైజీ ఖండించింది. కానీ సమీక్షలు జరిపిన తర్వాతే అన్ని అవకాశాలను పరిశీలిస్తామని కూడా స్పష్టం చేసింది.

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. సీజన్ అనంతర సమీక్ష కొనసాగుతోందని.. జట్టుకు సంబంధించిన ప్రతి అంశం సమీక్షించబడుతోందని ఆయన పేర్కొన్నారు. మీడియా నివేదికలకు విరుద్ధంగా ప్రస్తుతం ఆటగాళ్ల ట్రేడ్‌లకు సంబంధించి ఏ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపడం లేదు. సమీక్ష పూర్తయిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోబడుతుందని వెల్లడించారు. జట్టు అనేక ఎంపికలను పరిశీలిస్తోందని.. కానీ ఇంకా తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని కూడా ఆ ప్రతినిధి తెలిపారు.

Hardik Pandya to Chennai Super Kings Trade Rumors Mumbai Indians Finally Break Silence

ముంబై ఇండియన్స్ ట్రేడ్ పుకార్లను ఖండించినప్పటికీ.. హార్దిక్ పాండ్యా కోసం ఓ ట్రేడ్ జరిగే అవకాశం ఉందని వారి ప్రకటన సూచిస్తోంది. హార్దిక్ పాండ్యా కోసం జరిగే ట్రేడ్ విషయమై చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. ఆ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ ఆయుష్ మాత్రే, శివమ్ దూబేలను కోరుకోగా.. సీఎస్కే శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌లతో పాటు సుమారు రూ.10 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్ పాండ్యాపై ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఈ వాదనలన్నింటినీ తోసిపుచ్చింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలి: మాజీ క్రికెటర్

Also Read

డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలి: మాజీ క్రికెటర్

హార్దిక్ కెప్టెన్సీలో జట్టు పేలవ ప్రదర్శన
2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ప్రయాణం ముంబై ఇండియన్స్ జట్టుతో అంత సులభంగా సాగలేదు. 2024 ఐపీఎల్ సీజన్లో జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్ గెలవడంలో విఫలమైంది. గత సీజన్లో జట్టు కేవలం 4 మ్యాచ్‌లు గెలిచి పదింటిలో ఓడిపోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఈ కాలంలో జట్టులోని విభేదాలు సీనియర్ ఆటగాళ్ల నుంచి మద్దతు కొరవడటం, తరచూ గాయాలయ్యాడం వంటి వార్తలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తాయి. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ప్రస్తుతం ట్రేడ్ పుకార్లను ఖండిస్తూనే.. సీజన్ అనంతర సమీక్ష తర్వాత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా నిష్క్రమణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నది మాత్రం ఖాయమని తెలుస్తోంది.

Story first published: Sunday, August 2, 2026, 9:52 [IST]
Other articles published on Aug 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+