సరదా సంఘటన: పాండ్యాను కొట్టబోయిన ఫీల్డ్ అంపైర్
హైదరాబాద్: పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంఫైర్ రాడ్ టక్కర్ నవ్వుతూ భారత బ్యాట్స్‌మెన్ హార్ధిక్ పాండ్యాను చెంపపై కొట్టేంత పని చేశాడు. ఈ సరదా సంఘటన భారత్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో చోటు చేసుకుంది.
భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 33 ఓవర్లు ముగిశాయి. ఈ సమయంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. అప్పటికే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా (12), దినేశ్ కార్తీక్ (32) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. డ్రింక్స్ బ్రేక్‌కి ముందు చివరి బంతిని పాండ్యా ఆడాడు.

నవ్వుతూ కనిపించిన పాండ్యా
అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం వీరిద్దరిలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే విషయమై తికమకపడ్డారు. దీంతో మైదానంలోని అంఫైర్లు ఇద్దరూ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. దీనిని గమనించిన హార్దిక్ పాండ్యా నవ్వుతూ కనిపించాడు. అదే సమయంలో కార్తీక్ బ్యాటింగ్ చేయడానికి వెళ్తుండగా తనతో పాటు నాన్‌స్ట్రైకర్ వైపు వస్తున్న పాండ్యాకు అంపైర్ టక్కర్ నవ్వుతూ కొట్టబోయాడు.

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం
ఇదిలా ఉంటే రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 230 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమమైంది. సిరిస్ ఫలితం తేల్చే మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (7)ను వికెట్‌ను కోల్పోయింది.

వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధావన్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ధావన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 79 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (29) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి శిఖర్ ధావన్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో ధావన్ వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనతంరం ధావన్ (68) పరుగులు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యాతో కలిసి దినేశ్ కార్తీక్ వన్డేల్లో 9వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
దాటిగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా (30) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి దినేశ్ కార్తీక్ భారత్‌కు విజయాన్ని అందించాడు. దినేశ్ కార్తీక్ (64), ధోనీ (18) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి కివీస్ బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేసిన భువనేశ్వర్ కుమార్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications