న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd ODI: గాల్లోకి లేచి మరీ హార్ధిక్ పాండ్యా సూపర్ క్యాచ్ (వీడియో)

India Vs New Zealand : Hardik Pandya Takes A Stunning Catch To Dismiss Kane Williamson | Oneindia
Hardik Pandya takes a blinder to dismiss Kane Williamson in India vs New Zealand 3rd ODI - Watch video

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభమైన మూడో వన్డేలో భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

1st Test: ఇంగ్లాండ్‌పై రికార్డు విజయాన్ని నమోదు చేసిన వెస్టిండిస్1st Test: ఇంగ్లాండ్‌పై రికార్డు విజయాన్ని నమోదు చేసిన వెస్టిండిస్

దీంతో మూడో వన్డేలో విజయ్ శంకర్ స్థానంలో టీమిండియా తుది జట్టులో హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ బౌలింగ్ చేయడమే కాకుండా.. ఓ అద్భుతమైన క్యాచ్‌తో అభిమానుల్ని అలరించాడు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో భారత్ తరఫున హార్దిక్ పాండ్య చివరిసారి మ్యాచ్ ఆడాడు.

1
44082

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో

ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మణికట్టు స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) క్రీజు వెలుపలికి వచ్చి బంతిని మిడ్ వికెట్‌ దిశగా బాదేందుకు ప్రయత్నించాడు. తన‌ ఎడమవైపు వేగంగా వెళ్తున్న బంతిపైకి కళ్లుచెదిరే రీతిలో డైవ్ చేసిన హార్దిక్ పాండ్యా గాల్లోనే బంతిని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.

క్రీజు వెలుపలికి వచ్చి మరీ

క్రీజు వెలుపలికి వచ్చి మరీ

హార్దిక్‌ పాండ్యా నుంచి బంతిని తప్పించేందుకే క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్ ఆడిన విలియమ్సన్.. ఊహించని రీతిలో అతని చేతికే చిక్కడంతో నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్(38), టామ్ లాథమ్(28) పరుగులతో ఉన్నారు.

రెండు మార్పులతో బరిలోకి

రెండు మార్పులతో బరిలోకి

భారత్ తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. తొడ కండాలు పట్టేయడంతో ధోనికి విశ్రాంతినిచ్చిన కెప్టెన్ కోహ్లీ అతని స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని తీసుకున్నాడు. ఇక గత రెండు వన్డేలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ స్థానంలో హార్దిక్ పాండ్యాకి అవకాశమిచ్చాడు.

2-0 ఆధిక్యంలో టీమిండియా

2-0 ఆధిక్యంలో టీమిండియా

నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్‌ని 157 పరుగులకే కుప్పకూల్చి 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా.. మౌంట్‌ మాంగనుయ్‌‌లో జరిగిన రెండో వన్డేలోనూ 234కే ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది.

Story first published: Monday, January 28, 2019, 9:53 [IST]
Other articles published on Jan 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X