మోకాలుపై నిల్చుని
హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో 21 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచులో హార్దిక్ హాఫ్ సెంచరీ చేసిన దానికన్నా మరో ఘటనతో వార్తల్లో నిలిచాడు. హాఫ్ సెంచరీ అనంతరం హార్దిక్ మోకాలుపై నిల్చుని.. నల్లజాతీయుల కోసం జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్‌ఎమ్) ఉద్యమంకు మద్దతు తెలిపాడు. దీంతో నల్లజాతీయుల కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్ క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు. ఈ ఘటనతో నెటిజన్లు పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ హార్దిక్ అంటూ ఆకాశానికెత్తేశారు.

పోలార్డ్‌కు సంజ్ఞలు
హాఫ్ సెంచరీ అనంతరం నల్లజాతీయుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విన్యాసం చేసిన హార్దిక్ పాండ్యా.. సహచర ఆటగాడు, వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్‌కు సంజ్ఞలు చేశాడు. దీన్ని టీవీలలో ప్రేక్షకులు గమనించారు. కానీ వారికి అసలు విషయం అప్పుడు తెలియదు. హాఫ్ సెంచరీ చేసాడుగా.. ఇదో వెరైటీ సంబురాలు అనుకున్నారు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం #BlackLivesMatter అని తన ట్విట్టర్‌లో పాండ్యా పోస్ట్ చేశాడు. అప్పుడు అందరికి అసలు విషయం అర్థమైంది.

హోల్డర్ అసహనం
ఇటీవల రాజస్థాన్ రాయల్స్ మ్యాచుకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్‌ఎమ్) ఉద్యమంపై అసహనం వ్యక్తం చేశాడు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బీఎల్‌ఎమ్ ఉద్యమం జరుగుతుంటే ఐపీఎల్ 2020లో దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించిందన్నాడు. ఉద్యమంకు క్రికెట్ వెస్టిండీస్ ఎంతో మద్దతుగా నిలుస్తుంటే.. కొన్ని చోట్ల దాని ఊసే లేకపోవడం బాధకల్గిస్తుందన్నాడు. ఐపీఎల్‌లో బీఎల్‌ఎమ్ మాటే వినిపించడం లేదని, అసలు దాన్ని గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తుందని హోల్డర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తన సహచర క్రికెటర్ కీరన్ పోలార్డ్‌కు హార్దిక్ పాండ్యా మద్దతు తెలిపాడు.


Click it and Unblock the Notifications

తోడు ఉండాల్సిందే.. ముద్దులతో రెచ్చిపోయిన జ్వాలా గుత్తా!!