Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.2.2 కోట్ల సీఎస్కే బౌలర్‌పై హార్దిక్ విధ్వంసం..ఒకే ఓవర్‌లో 29 పరుగులు (Video)

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పరుగుల వరద పారిస్తున్నాడు. తన విధ్వంసంతో బరోడాకు వరుస విజయాలు అందిస్తున్నాడు. గ్రూప్-బీలో భాగంగా బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. హార్దిక్ ఊచకతతో 222 పరుగుల లక్ష్యాన్ని బరోడా ఆఖరి బంతికి ఛేదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 221 పరుగులు చేసింది. జగదీషన్ (57; 32 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), విజయ్ శంకర్ (42 నాటౌట్; 22 బంతుల్లో, 6 సిక్సర్లు), కెప్టెన్ షారుక్ ఖాన్ (39; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బరోడా బౌలర్లలో మెరీవాలా (3/41) మూడు, కృనాల్ పాండ్య (1/26), నినాద్ (1/32), మహేష్ (1/10) తలో వికెట్ తీశారు.

Hardik Pandya Smashes 29 Runs in One Over Against 2 20 Crore CSK Pacer in Syed Mushtaq Ali Trophy

అనంతరం ఛేదనలో బరోడా 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య అర్ధశతకంతో సత్తాచాటాడు. భాను పనియా (42; 20 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తమిళనాడు బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/43) మూడు, సాయి కిశోర్ (2/23) రెండు వికెట్లు తీశారు. అయితే 17వ ఓవర్ వేసిన గుర్జప్‌నీత్‌ సింగ్ బౌలింగ్‌లో హార్దిక్ విధ్వంసం సృష్టించాడు. తొలి మూడు బంతుల్ని భారీ సిక్సర్‌‌గా మలిచాడు. తర్వాత నోబాల్ వేయగా మరో సిక్సర్, బౌండరీ హార్దిక్ బాదాడు. ఆఖర్లో సింగిల్ తీయండతో 17వ ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఈ ఎడమచేతి వాటం బౌలర్ గుర్జప్‌నీత్ సింగ్‌ను సీఎస్కే రూ.2.2 కోట్లు వెచ్చించి తీసుకుంది. గతంలో సీఎస్కే నెట్‌ బౌలర్ అయిన గుర్జప్‌నీత్ కోసం వేలంలో గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడింది. కానీ సీఎస్కే భారీ ధర వెచ్చించి ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ నయా సీఎస్కే బౌలర్‌‌కు చుక్కులు చూపిస్తూ హార్దిక్ బ్యాటింగ్ కొనసాగించాడు.

Story first published: Thursday, November 28, 2024, 8:01 [IST]
Other articles published on Nov 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+