Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ మరోసారి విధ్వంసం..ఒకే ఓవర్‌లో 28 పరుగులు (Video)

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 29 పరుగుల ఊచకోతను మరువకముందే త్రిపురపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పర్వేజ్ సుల్తాన్ వేసిన ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీతో 28 పరుగులు పిండుకున్నాడు. బరోడాను మరోసారి విజయతీరాలకు చేర్చాడు.

గ్రూప్-బీలో భాగంగా ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బరోడా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన బరోడా అన్నింట్లోనూ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 109 పరుగులు చేసింది. కెప్టెన్ మన్‌దీప్ (50; 40 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. అభిమన్యు సింగ్ (3/19) మూడు, కృనాల్ పాండ్య (2/22) రెండు వికెట్లు తీశారు.

Hardik Pandya Smashes 28 Runs in a Single Over for Baroda in Syed Mushtaq Ali Trophy

అనంతరం ఛేదనలో బరోడా 11.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. హార్దిక్ పాండ్య (47; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మితేశ్ పటేల్ (37; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. మణిశంకర్, సౌరభ్, పర్వేజ్ తలో వికెట్ తీశారు. అయితే పర్వేజ్ వేసిన 10 ఓవర్‌లో హార్దిక్ శివమెత్తాడు. తొలి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్ బాదాడు. రెండో బంతికి పరుగులేమి చేయని హార్దిక్ ఆ తర్వాతి రెండు బంతుల్ని స్క్వేర్ లెగ్, మిడాఫ్ మీదుగా స్టాండ్స్‌కు తరలించాడు. అనంతరం థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆఖరి బంతిని మిడాఫ్ మీదుగా మరో సిక్సర్ బాదాడు.

తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో గుర్జప్‌నీత్‌ సింగ్ వేసిన ఓవర్‌లో హార్దిక్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీతో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఎడమచేతి వాటం బౌలర్ గుర్జప్‌నీత్ సింగ్‌ను సీఎస్కే రూ.2.2 కోట్లు వెచ్చించి తీసుకుంది.

Story first published: Friday, November 29, 2024, 15:30 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+