Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా 20 సిక్సుల వెనక నటాషా ఉంది.. నేను త్వరలో వివాహం చేసుకోవాలి!!

Hardik Pandya smashes 20 sixes in DY Patil T20, Fans Outrageously Troll him

ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పూనకం వచ్చినట్లే ఆడుతున్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో ఇప్పటికే రెండు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న హార్దిక్‌.. ఈసారి 20 సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాటిల్‌ కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడుతున్న హార్దిక్‌.. తాజాగా బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. శతకం పూర్తి చేసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయాడు. 55 బంతుల్లో 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

 పాండ్యకు పిచ్చెక్కిందా?:

పాండ్యకు పిచ్చెక్కిందా?:

డివై పాటిల్‌ టీ20 కప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు నిరూపించుకున్నాడని అభిమానులు అంటున్నారు. మైదానంలో సిక్సర్ల మోత మోగిస్తున్న పాండ్యాపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు ఫాన్స్ ప్రశంసలతో పాటు పంచ్‌లు కూడా విసురుతున్నారు. 'పాండ్యకు పిచ్చెక్కిందా.. ఇలా ఆడుతున్నాడు' అని ఓ ఫ్యాన్ సరదాగా ట్వీట్ చేసాడు.

నేను త్వరలో వివాహం చేసుకోవాలి:

నేను త్వరలో వివాహం చేసుకోవాలి:

'శివమ్‌ దూబె బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ వెళ్లి ఒంటి కాలితో కవర్స్‌లోకి మలిచిన సిక్సర్‌ అద్భుతం' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఈ టోర్నీని సన్నాహకంగా ఉపయోగించుకుంటున్నాడు' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'హార్దిక్ పాండ్యా తన రోజున విధ్వంసం సృష్టించగలడు', 'ఇది నిజమని తెలియదు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది. నేను త్వరలో వివాహం చేసుకోవాలి' అని కామెంట్లు పెడుతున్నారు. పాండ్యా గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్‌కోవిచ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని అలా ట్వీట్ చేసాడు.

భారీ విజయం:

భారీ విజయం:

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బీపీసీఎల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పాండ్యా రెచ్చిపోవడంతో మొదటగా బ్యాటింగ్‌ చేసిన రిలయన్స్‌-1 స్కోరు బోర్డుపై 238 పరుగుల్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్‌ 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రిలయన్స్‌ 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

 ఫ్యాన్స్ ఎంజాయ్:

ఫ్యాన్స్ ఎంజాయ్:

హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాండ్యా ఫామ్‌లోకి వచ్చాడని, ముంబైకి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంబై కీలక ఆటగాడైన హార్దిక్‌ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ఈ టోర్నీలో పాండ్యా ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించారు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో ఎంట్రీ:

దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో ఎంట్రీ:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌-ఎ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ.. అతను వర్క్‌లోడ్ టెస్ట్‌లో విఫలమవడంతో ఆ టూర్‌కు దూరమయ్యాడు. పాండ్యాను జట్టులో తీసుకురావాడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్ బాగా ప్రయత్నించింది. అతని కోసం జట్ల ఎంపికను కూడా వాయిదా వేసింది. అతను పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని భావించి ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌తో పాండ్యా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Friday, March 6, 2020, 21:18 [IST]
Other articles published on Mar 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+