For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తనయుడితో హార్దిక్‌.. జూనియర్‌ పాండ్యా ఎలా ఉన్నాడో చూడండి!!

Hardik Pandya shares first full picture of his baby boy

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని ప్రేయసి నటాషా స్టాంకోవిక్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. శనివారం తన తనయుడితో దిగిన తొలి ఫొటోను పాండ్యా సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఆ ఫొటోకు 'దేవుడి దీవెన' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. చిన్నారిని హార్దిక్‌ తన చేతుల్లోకి తీసుకొని ప్రేమతో చూస్తున్న ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఫొటోలో బుజ్జి పాండ్యా చాలా అందంగా ముద్దులొలికేలా కనిపిస్తున్నాడు. ఎంతో సంతోషంగా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను హార్దిక్‌ పాండ్యా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో.. నెటిజన్ల నుంచి విశేష మంచి స్పందన వస్తోంది. 'జూనియర్‌ పాండ్యా చాలా క్యూట్‌గా ఉన్నాడు', 'కంగ్రాట్స్‌ హార్దిక్' అని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. కొడుకు చెయ్యి పట్టుకొని దిగిన ఫొటోను హార్దిక్‌ గురువారం పోస్ట్‌ చేస్తూ.. దేవుడు మాకు మగబిడ్డని ప్రసాదించాడని సోషల్‌మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

కుమారుడి రాకతో హార్దిక్ పాండ్యా ఒకవైపు ఆనందంలో మునిగితేలుతూ.. మరోవైపు పితృత్వపు మాధుర్యాని ఆస్వాదిస్తున్నాడు. ఇక తండ్రిగా సపర్యలు కూడా ప్రారంభించాడు. బాబుకు అవసరమైన డైపర్లు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారా అతడు పంచుకున్నాడు. 'నటాషా.. బుజ్జాయి డైపర్లు వచ్చేస్తున్నాయి' అని హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టాడు.

హార్దిక్ పాండ్యా‌, నటాషా స్టాంకోవిక్ చాలాకాలం ప్రేమించుకున్నారు. అప్పుడప్పుడు కలిసి పార్టీలు, పార్క్‌లకు వెళ్లేవారు. హఠాత్తుగా గతేడాది డిసెంబర్‌ 31 రాత్రి దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ నటాషాకు హార్దిక్ నిశ్చితార్థపు ఉంగరం తొడిగేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే ఉన్నట్టుండి లాక్‌డౌన్‌లో అతడు మళ్లీ షాకిచ్చాడు. తన భార్య గర్భం దాల్చిందని చెప్పాడు. ఎవరినీ పిలవకుండా కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నట్టు ఆ తర్వాత తెలిసింది.

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. మరోవైపు ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో నటాషా స్టాన్‌కోవిచ్‌ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. ఆపై పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడిపారు. ఇక ఈ ఏడాది నుండి పూర్తిగా పాండ్యానే ఉంటున్నారు. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలోనే స్థిరపడ్డారు.

Story first published: Saturday, August 1, 2020, 15:09 [IST]
Other articles published on Aug 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+