Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: ఢిల్లీపై హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ

Hardik Pandya: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అయితే ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ముంబై నిరాశపరిచింది. ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరిట ఒక కీలక రికార్డు నమోదు కానుంది.

హార్దిక్ పాండ్యా పేరిట కీలక రికార్డు
నిజానికి హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో కెప్టెన్‌గా తన 50వ మ్యాచ్ ఆడనున్నాడు. అలాంటి ఘనత సాధించిన 13వ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలవనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 50 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లకు నాయకత్వం వహించిన కెప్టెన్లు 12 మంది మాత్రమే ఉన్నారు. హార్దిక్ పాండ్యాతో పాటు ఏప్రిల్ 14న జరిగే ఐపీఎల్ 50వ మ్యాచ్ కు రిషబ్ పంత్ కూడా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ అలా చేసిన 14వ కెప్టెన్ అవుతాడు.

Hardik Pandya Sets to Captain His 50th IPL Match Against Delhi Capitals

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్సీ చేపట్టిన వారిలో ఎంఎస్ ధోని పేరు మొదటి స్థానంలో ఉంది. ఎంఎస్ ధోని 227 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ 158 మ్యాచ్‌లతో జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన నాలుగో కెప్టెన్ గౌతమ్ గంభీర్. గంభీర్ 129 మ్యాచ్ లకు కెప్టెన్‌గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 83 మ్యాచ్ లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్‌లో అత్యధికంగా మ్యాచ్‌లలో కెప్టెన్లుగా వ్యవహరించిన ఆటగాళ్లు వీరే..
1.ఎంఎల్ ధోని(ఇండియా) -227
2.రోహిత్ శర్మ(ఇండియా) -158
3.విరాట్ కోహ్లీ(ఇండియా)-143
4.గౌతమ్ గంభీర్(ఇండియా) -129
5.డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)-83
6.శ్రేయస్ అయ్యర్(ఇండియా)-75
7.ఆడమ్ గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా) -74
8.కేఎల్ రాహుల్(ఇండియా) -64
9. సంజు శాంసన్(ఇండియా) -63
10. షేన్ వార్న్(ఆస్ట్రేలియా) -55
11.వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా) -53
12.సచిన్ టెండూల్కర్(ఇండియా)-51
13. హార్దిక్ పాండ్యా(ఇండియా)-49*
14.రిషబ్ పంత్(ఇండియా)-49*

Story first published: Sunday, April 13, 2025, 18:42 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+