ధోనీ నాకు పెద్దన్న.. లైఫ్ కోచ్.. ఆ రోజు నా కోసం కింద పడుకున్నాడు: హార్దిక్ పాండ్యా

T20 World Cup 2021 : Dhoni అలా పడుకోవడం ఫస్ట్ టైం చూశా - Hardik Pandya || Oneindia Telugu

దుబాయ్: ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ అని స్టార్ ఆల్‌-రౌండర్ హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. తన కెరీర్లో ఎన్నో సందర్బాల్లో ధోనీ భాయ్ అండగా నిలిచాడని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అతను తనకు పెద్దన్నలాంటివాడని, లైఫ్ కోచ్ అని మహీతో ఉన్న సాన్నిహిత్యాన్ని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫోతో మాట్లాడిన హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లోనే ఈ టీ20 ప్రపంచకప్ అతిపెద్ద బాధ్యతన్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో మహీ భాయ్ లేకపోవడంతో ఓ ఫినిషర్‌గా టీమ్‌ను గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు.

నా బాధ్యత పెరిగింది..

నా బాధ్యత పెరిగింది..

‘ఈ టీ20 ప్రపంచకప్ నా కెరీర్‌లోనే అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే ఈసారి మహీ భాయ్ లేడు. కాబట్టి ఫినిషర్‌గా అన్ని బాధ్యతలు నా భుజాలపైనే ఉన్నాయి. ఇది నాకు సవాల్‌ లాంటిది. నన్ను మొదటి నుంచి బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ధోనీ భాయ్‌. నా గురించి అతనికి బాగా తెలుసు. రెండేళ్ల క్రితం ఓ టీవీషోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా నేను విమర్శల పాలైనప్పుడు ధోనీ భాయ్‌ నాకు ధైర్యం చెప్పాడు.

అదొక్కటే కాదు నా కెరీర్లో ఎన్నో సార్లు అతను నాకు మద్దతుగా నిలిచాడు. వ్యక్తిగతంగా నేను ఎలాంటి వ్యక్తినో ధోనీకి బాగా తెలుసు. కాబట్టి, ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని. అతను నాకు పెద్దన్నలాంటి వాడు' అని హర్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.

నా కోసం కింద పడుకున్నాడు..

నా కోసం కింద పడుకున్నాడు..

2019 న్యూజిలాండ్ పర్యటనలో తనకు హోటల్ గది లేకుంటే ధోనీ తన బెడ్ ఇచ్చాడని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. తన కోసం మహీ భాయ్ నేలపై పడుకున్నాడని చెప్పుకొచ్చాడు. ‘జట్టు నుంచి వేటుకు గురైన తర్వాత 2019 జనవరిలో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేశారు.

అప్పుడు నాకు హోటల్ గది కేటాయించలేదు. కానీ నన్ను ధోనీ తన రూమ్‌కు పిలిచి బెడ్ ఇచ్చాడు. తనకు బెడ్‌పై పడుకునే అలవాటు పెద్దగా లేదని నన్ను కన్విన్స్ చేసి కిందపడుకున్నాడు. నాకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి ధోనీ'అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

 గొప్ప ఆల్‌రౌండర్ అవుతానని....

గొప్ప ఆల్‌రౌండర్ అవుతానని....

2016లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా.. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ఆ సందర్భంగా కపిల్ దేవ్ తనతో అన్న మాటలను తాజాగా పాండ్యా గుర్తు చేసుకున్నాడు. ‘కపిల్ దేవ్ చేతులు మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకోవడం స్పెషల్ ఫీలింగ్. ఎందుకంటే కపిల్ సర్.. తనకంటే మెరుగ్గా రాణిస్తానని, విజయం సాధిస్తానని, కష్టపడాలని చెప్పాడు. ఇక నా బ్యాక్ సర్జరీ ముందు కూడా కాల్ చేశాడు. ‘బేటా.. పాలలో పసుపు వేసుకొని తాగు. అంతా సర్దుకుంటుంది. జాగ్రత్త'అని చెప్పాడు.'అని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు.

ఫినిషర్‌గానే..

ఫినిషర్‌గానే..

2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యా ఈ ప్రపంచకప్‌లో ఏ పాత్ర పోషిస్తాడనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. అతను మళ్లీ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తాడా? లేదా ఫినిషర్‌గా మారి మ్యాచ్‌లు ముగిస్తాడా? అనే విషయంపై స్పష్టత కరువైంది. అయితే సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ఈ ప్రశ్నలకు కొంతవరకు సమాధానం దొరికింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయని హార్దిక్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఫినిషర్ పాత్ర పోషించాడు. తాను కూడా ఫినిషర్‌గానే తనపై టీమ్ మేనేజ్‌మెంట్ పెద్ద బాధ్యత ఉంచిందని పేర్కొన్నాడు. కేవలం అతను బ్యాట్స్‌మన్‌గానే జట్టులో కొనసాగే అవకాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 19, 2021, 10:28 [IST]
Other articles published on Oct 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X