Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో చోటు గురించి ఇప్పుడు ఆలోచించను

 Hardik Pandya says i dont think about my return to team india.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహిస్తున్న పాండ్యా ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ కాంటెండర్ లిస్టులో (అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే క్యాప్) రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 81.83సగటుతో 491పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ ఉన్నాడు. కాగా హార్దిక్ పాండ్యా 73.75సగటుతో 295పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. పాండ్యా ఈ సీజన్లో 7.65ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. 5 ఇన్నింగ్స్‌లలో 4వికెట్లు తీశాడు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ కాన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. అతను గాయం కారణంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైనా తిరిగి నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుతో చేరాడు. మంచి ఫామ్ కొనసాగిస్తుండడంతో అతను టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది.

ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాండ్యాను మ్యాచ్ అనంతరం కామెంటేటర్.. టీమిండియాకు ఎంపిక అవ్వడానికి మీ ప్రదర్శన ఉపయోగపడుతుంటారా అంటూ ప్రశ్నించగా పాండ్యా స్పందిస్తూ.. 'ఈ ప్రదర్శన టీమిండియాలో పునరాగమనం కోసం అని నేను అనుకోను, ఇప్పుడు టీమిండియాకు ఎంపిక అయ్యే విషయం గురించి కూడా దృష్టి పెట్టను. నేను ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్లో నా ఆట మీదే దృష్టి పెడతాను' అని స్పష్టం చేశాడు.

అలాగే గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహిస్తుండడంపై పాండ్యా స్పందిస్తూ.. 'కెప్టెన్సీ వల్ల మనం ఆడే విధానంలో స్పష్టంగా మార్పు కన్పిస్తుంది. నేను ఎప్పుడూ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతాను. చాలా ఏళ్లుగా ఆడుతున్నందున ఆటపై మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనే విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అంతా బాగుంది.' అన్నాడు. గజ్జలో గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌కు దూరమైన పాండ్యా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 67పరుగులతో రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.

పాండ్యా కీలక ఇన్నింగ్స్ వల్ల గుజరాత్ టైటాన్స్‌.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై 8పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లకు 156పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 రన్స్ చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 6 సిక్సర్లు, ఫోర్‌తో 48), రింకూ సింగ్(35) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్ చెరొక వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, April 24, 2022, 10:43 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+